బొద్దింకతో హాస్పటల్ కు వచ్చిన మహిళ.. డాక్టర్ షాక్

దిశ, వెబ్‌డెస్క్: చెవి నొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళను పరీక్షించగా ప్రాణాలతో ఉన్న బొద్దింకను చూసి డాక్టర్ షాకయ్యాడు. అనంతరం విజయవంతంగా దానిని తొలగించాడు. ఈ ఘటన చైనాలోని గాంగ్‌డాంగ్ ప్రావినెన్స్‌లో వెలుగుచూసింది. చెవిలో ఓ రకమైన శబ్ధం రావడంతో పాటు తీవ్రమైన నొప్పితో బాధపడుతూ చెన్ అనే మహిళ స్థానిక ఆస్పత్రికి వెళ్లింది. బయటి నుంచి చెవిలో ఏమీ కనిపించకున్నా..ఏదో పాకుతున్నట్లు అనిపించి ఆస్పత్రికి వెళ్లినట్లు చెన్ స్థానిక మీడియాకు తెలిపింది. ఆస్పత్రిలో వైద్యుడు […]

Update: 2020-07-03 09:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: చెవి నొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళను పరీక్షించగా ప్రాణాలతో ఉన్న బొద్దింకను చూసి డాక్టర్ షాకయ్యాడు. అనంతరం విజయవంతంగా దానిని తొలగించాడు. ఈ ఘటన చైనాలోని గాంగ్‌డాంగ్ ప్రావినెన్స్‌లో వెలుగుచూసింది. చెవిలో ఓ రకమైన శబ్ధం రావడంతో పాటు తీవ్రమైన నొప్పితో బాధపడుతూ చెన్ అనే మహిళ స్థానిక ఆస్పత్రికి వెళ్లింది. బయటి నుంచి చెవిలో ఏమీ కనిపించకున్నా..ఏదో పాకుతున్నట్లు అనిపించి ఆస్పత్రికి వెళ్లినట్లు చెన్ స్థానిక మీడియాకు తెలిపింది. ఆస్పత్రిలో వైద్యుడు ఓటోస్కోప్‌తో చెవిలో పరిశీలించగా..చెవి లోపలి భాగంలో ప్రాణాలతో ఉన్న బొద్దింకను చూసి షాక్‌కు గురైయ్యాడు. ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా..అతి జాగ్రత్తగా దాన్ని ఆమె చెవిలో నుంచి తొలగించాడు. సరైన సమయంలో ఆమె ఆస్పత్రికి రావడంతో పెను ముప్పు తప్పిందని డాక్టర్ యి తెలిపాడు. ఏ మాత్రం ఆలస్యం జరిగినా బొద్దింక కర్ణబేరి ద్వారా లోపలకు వెళ్లుంటే తీవ్ర నష్టం జరిగేదన్నాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో బొద్దింక చెవిలోకి ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు.

అయితే, ఇళ్లల్లో బొద్దింకలు ఉంటే ఏ మాత్రం అశ్రద్ధ వహించకుండా వాటిని తొలగించేందుకు క్రిమిసంహారాలు వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే క్రిములు ఏవైనా చెవిలోకి వెళ్లినట్లు అనిపిస్తే…కాటన్ బడ్స్‌తో వాటిని తొలగించేందుకు ప్రయత్నించరాదని సూచిస్తున్నారు. చైనాలో గతేడాది ఓ వ్యక్తి చెవిలో పెద్ద సంఖ్యలో బొద్దింకలు ఉండటం షాక్‌కు గురిచేసింది. ఆహార వ్యర్థాలను తన పడక దగ్గరే పెట్టి నిద్రపోవడంతో బొద్దింకలు చెవిలోకి ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు. నిద్రలో ఉన్న సమయంలో బొద్దింకలు, ఇతర క్రిములు చెవిలోకి ప్రవేశించే ప్రమాదం ఉన్నందున..పడగ గదిలో ఆహార వ్యర్థాలేవీ ఉంచొద్దని వైద్యులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News