సర్టిఫికెట్ కోసం వెళ్లిన విద్యార్థులు.. దురుసుగా ప్రవర్తించిన డాక్టర్
దిశ, దుమ్ముగూడెం : దుమ్ముగూడెం మండల పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యా్ర్థుల పట్ల ఓ డాక్టర్ అమానుషంగా వ్యవహరించారు. వివరాల ప్రకారం.. అడవి రామవరం గ్రామానికి చెందిన వీరభద్రం కొడుకు కళ్యాణ్ బాబుకు దమ్మపేట మండలం గండుగులపల్లిలో 6వ తరగతి చదివేందుకు ఏకలవ్య పాఠశాలలో సీటు వచ్చింది. అయితే, స్కూల్‌లో చేరేందుకు ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ అవసరం ఉండగా డాక్టర్ సంతకం కోసం లక్ష్మీ నగరం ప్రభుత్వ ఆస్పత్రికి కళ్యాణ్ సహా పలువురు విద్యార్థులు వెళ్లారు. […]
దిశ, దుమ్ముగూడెం : దుమ్ముగూడెం మండల పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యా్ర్థుల పట్ల ఓ డాక్టర్ అమానుషంగా వ్యవహరించారు. వివరాల ప్రకారం.. అడవి రామవరం గ్రామానికి చెందిన వీరభద్రం కొడుకు కళ్యాణ్ బాబుకు దమ్మపేట మండలం గండుగులపల్లిలో 6వ తరగతి చదివేందుకు ఏకలవ్య పాఠశాలలో సీటు వచ్చింది.
అయితే, స్కూల్‌లో చేరేందుకు ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ అవసరం ఉండగా డాక్టర్ సంతకం కోసం లక్ష్మీ నగరం ప్రభుత్వ ఆస్పత్రికి కళ్యాణ్ సహా పలువురు విద్యార్థులు వెళ్లారు. ఈ క్రమంలో వారిని మూడు రోజుల పాటు తిప్పించుకొని సర్టిఫికెట్ రాసి ఇవ్వకుండానే.. గెట్ ఔట్ అంటూ డాక్టర్ బాలాజీ నాయక్.. నలుగురు విద్యార్థులను తిట్టారని వారు తెలిపారు. ఇలాంటి పరిస్థితి మరో విద్యార్థికి జరగకుండా ఉండాలంటే.. డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్‌కు లేఖ రాశారు.