అమ్మ నన్ను క్షమించు.. చెరువులో దూకి డాక్టర్ సూసైడ్..
దిశ, వెబ్‌డెస్క్ : అప్పుల బాధ భరించలేక యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ రాసి.. ఎల్లమ్మ చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన నేత్ర వైద్యుడు రాజేశ్ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టి అదృశ్యమయ్కాడు. ఈ క్రమంలో శుక్రవారం హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు వద్ద రాజేశ్ చెప్పులు, మొబైల్ దొరికాయి. ఈ క్రమంలో చెరువులో ఎంత గాలించినా […]
దిశ, వెబ్‌డెస్క్ : అప్పుల బాధ భరించలేక యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ రాసి.. ఎల్లమ్మ చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన నేత్ర వైద్యుడు రాజేశ్ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టి అదృశ్యమయ్కాడు. ఈ క్రమంలో శుక్రవారం హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు వద్ద రాజేశ్ చెప్పులు, మొబైల్ దొరికాయి.
ఈ క్రమంలో చెరువులో ఎంత గాలించినా రాజేశ్ మృతదేహం లభ్యం కాలేదు. అయితే శనివారం ఉదయం చెరువులో రాజేశ్ మృతదేహం పైకి తేలడంతో పోలీసులు అతడి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజేశ్ ఓ ప్రైవేటు క్లినిక్‌లో నేత్ర వైదుడిగా పని చేస్తున్నారు. అయితే తనకు మరణానికి ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. లేఖలో అమ్మ నన్ను క్షమించు మీకు నేను ఏం చేయలేకపోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.