ప్రజలకు కొంతైనా మంచి చేయాలి.. తమిళిసై 

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలకు ఎంతో కొంత మంచి చేయాలని తన మనసు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుందని, తన లక్ష్యం కూడా అదేనని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రజాసేవతో లభించే సంతృప్తి మరే పనిలోనూ దొరకదన్నారు. ప్రతిఒక్కరూ బలహీన వర్గాలు, ఆపదలో ఉన్న వారికి చేతనైనంత సాయం చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాకు చెందిన మల్టీ ఎథ్నిక్ అడ్వైజరీ టాస్క్‌ఫోర్స్ సంస్థ ఇటీవల ‘టాప్ ట్వంటీ గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్-2021’ అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా […]

Update: 2021-03-12 11:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలకు ఎంతో కొంత మంచి చేయాలని తన మనసు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుందని, తన లక్ష్యం కూడా అదేనని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రజాసేవతో లభించే సంతృప్తి మరే పనిలోనూ దొరకదన్నారు. ప్రతిఒక్కరూ బలహీన వర్గాలు, ఆపదలో ఉన్న వారికి చేతనైనంత సాయం చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాకు చెందిన మల్టీ ఎథ్నిక్ అడ్వైజరీ టాస్క్‌ఫోర్స్ సంస్థ ఇటీవల ‘టాప్ ట్వంటీ గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్-2021’ అవార్డులను ప్రకటించింది.

ఈ సందర్భంగా శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైను సిబ్బంది సన్మానించారు. గవర్నర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాజ్‌భవన్ దేశానికే రోల్ మోడల్‌గా నిలవాలని, ప్రజాసేవలో ప్రతిఒక్కరూ మనవైపు చూసేలా పని చేయాలని సిబ్బందిని ఆమె కోరారు. ఏ సంస్థ ఎన్ని అవార్డులు ఇచ్చినా మనం ఏ ప్రజల కోసం పనిచేస్తున్నామో వారిలో కనిపించే చిరునవ్వే అన్నింటికీ మించిన గుర్తింపు అని ఆమె అన్నారు.

 

 

Tags:    

Similar News