బొగ్గు గనులను ప్రైవేటు పరం చేస్తే ఊరుకోం: ఉద్యోగులు
దిశ, గోదావరిఖని: సింగరేణిలో 4 బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలో ఐఎన్ టీయూసీ ఆధ్వర్యంలో ఆర్జీ-1 గ్రూపులోని జీడీకే 1,2ఇంక్లైన్, 2ఏ గని మేనేజర్లకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేస్తే సహించేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో RG-1 INTUC కో-ఆర్డినేటర్ కచ్చ కాయల […]
దిశ, గోదావరిఖని: సింగరేణిలో 4 బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలో ఐఎన్ టీయూసీ ఆధ్వర్యంలో ఆర్జీ-1 గ్రూపులోని జీడీకే 1,2ఇంక్లైన్, 2ఏ గని మేనేజర్లకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేస్తే సహించేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో RG-1 INTUC కో-ఆర్డినేటర్ కచ్చ కాయల సదానందం, గుండెటి శ్రీనివాస్, ఆయా గనుల ఫిట్ సెక్రటరీలు నూనె రాజయ్య, మహేష్, సంపత్, అవినాష్, కనకయ్య, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు అనిల్, రాజేష్, మోగిలి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.