'ఇ-పాస్'ను రద్దు చేయండి : స్టాలిన్

దిశ, వెబ్ డెస్క్: కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కొత్త విధానాలను అవలంభించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థపై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘ఇ-పాస్’ వ్యవస్థను రద్దు చేయాలని స్టాలిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల ప్రయాణానికి “కృత్రిమ అవరోధం” సృష్టించవద్దని గురువారం తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. అంతర్-జిల్లా ప్రయాణానికి తీసుకొచ్చిన ఇ-పాస్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలన్నారు. వైద్య అత్యవసర పరిస్థితులు, […]

Update: 2020-08-06 08:49 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కొత్త విధానాలను అవలంభించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థపై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘ఇ-పాస్’ వ్యవస్థను రద్దు చేయాలని స్టాలిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల ప్రయాణానికి “కృత్రిమ అవరోధం” సృష్టించవద్దని గురువారం తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.

అంతర్-జిల్లా ప్రయాణానికి తీసుకొచ్చిన ఇ-పాస్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలన్నారు. వైద్య అత్యవసర పరిస్థితులు, మరణాలు, వివాహాలకు అంతర్-జిల్లా ప్రయాణానికి అనుమతి ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ, అత్యవసర పరిస్థితుల కోసం ఇ- పాస్‌ల దరఖాస్తులు చాలాసార్లు తిరస్కరించబడ్డాయని విమర్శించారు. ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఇ-పాస్ అమలు చేయడంలో వైఫల్యం చెందిందని స్టాలిన్ మండిపడ్డారు.

Tags:    

Similar News