షాకింగ్.. స్టాలిన్ సీఎం కావాలని అభిమాని ఏం చేశాడంటే!

దిశ, వెబ్‌డెస్క్ : ‘అభిమానం’ అనే పిచ్చి రోజురోజుకూ పరాకాష్టకు చేరుతోంది. సినిమాల్లో హీరోల కోసం, రాజకీయాల్లో తమ ప్రియతమ నేత కోసం ఫ్యాన్స్ డిఫరెంట్ ఫీట్స్ చేస్తుంటారు. ఆ విధంగా తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. కొందరు పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి అభిమానాన్ని చాటుకుంటే.. మరికొందరు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేస్తుంటారు. ఇంకొందరు ఒంటి మీద పచ్చబొట్లు కొట్టించుకుని తమ ఇష్టాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇదంతా ఒకవైపయితే తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత […]

Update: 2021-04-04 06:16 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ‘అభిమానం’ అనే పిచ్చి రోజురోజుకూ పరాకాష్టకు చేరుతోంది. సినిమాల్లో హీరోల కోసం, రాజకీయాల్లో తమ ప్రియతమ నేత కోసం ఫ్యాన్స్ డిఫరెంట్ ఫీట్స్ చేస్తుంటారు. ఆ విధంగా తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. కొందరు పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి అభిమానాన్ని చాటుకుంటే.. మరికొందరు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేస్తుంటారు. ఇంకొందరు ఒంటి మీద పచ్చబొట్లు కొట్టించుకుని తమ ఇష్టాన్ని ప్రదర్శిస్తుంటారు.

ఇదంతా ఒకవైపయితే తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఓ అభిమాని(డీఎంకే కార్యకర్త) ఎవరూ సాహసించని దారుణానికి ఒడిగట్టాడు. చెన్నైలోని విరుదునగర్‌లో మితిమీరిన అభిమానంతో గురవయ్య అనే వ్యక్తి సాథుర్‌లోని మరియమ్మ అమ్మవారికి తన చేతివేళ్లను నరికి సమర్పించుకున్నాడు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపగా, అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Tags:    

Similar News