సీఎం కేసీఆర్‌ను గద్దె దింపే వరకు నిద్రపోవద్దు : డీకే అరుణ
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌ను గద్దె దింపే వరకు నిద్ర పోవద్దని, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో శనివారం ఇందూరు జిల్లా శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా డీకే అరుణ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్న జూటకొరు అని విమర్శించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌తో కుమ్మక్కు కావడమే […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌ను గద్దె దింపే వరకు నిద్ర పోవద్దని, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో శనివారం ఇందూరు జిల్లా శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా డీకే అరుణ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్న జూటకొరు అని విమర్శించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌తో కుమ్మక్కు కావడమే కాకుండా, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు.
గతంలో ముఖ్యమంత్రులు వారి సొంత జిల్లాలనే అభివృద్ధి చేసుకుంటున్నారు అని మాటలు చెప్పిన కెసీఆర్, ఇప్పుడు కేవలం గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నారని నిప్పులు చెరిగారు. ఇవాళ రైతుల ఆత్మహత్యలకు కారణమైతున్న కెసీఆర్ కు మన రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని పేర్కొన్నారు. ఎన్నికలు 2022, 2023 లో వచ్చిన బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని , తెలంగాణలో కాషాయం ఎగురవేయడం పక్కా అని డీకే అరుణ కార్యకర్తలకు ఉత్సాహం నింపారు. కరోనా అందిస్తుంది కేంద్రం, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ప్రధాని ఫోటో పెట్టకుండా వారు వ్యాక్సిన్ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు షో చేస్తున్నారు అన్నారు . ప్రధాని ఫోటో పెట్టకుండా, ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోడానికి సిగ్గు లేదా అని డీకే అరుణ ప్రశ్నించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది.