'ఆత్మగౌరవం లేనివారే కేసీఆర్‌కు మోకరిల్లుతున్నారు'

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఆత్మ గౌరవం లేని వారే అధికారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కు మోకరిల్లుతున్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మంగళవారం జూమ్ ద్వారా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆత్మగౌరవాన్ని చంపుకుని అధికారం కోసం ముఖ్యమంత్రి కెసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ పదవులను పట్టుకుని వేలాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఇతరుల ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడుతున్న నేతలు తాము ఎంత ఆత్మగౌరవంతో ఉన్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ‘పల్లా రాజేశ్వర్ రెడ్డి 150 […]

Update: 2021-06-01 08:18 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఆత్మ గౌరవం లేని వారే అధికారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కు మోకరిల్లుతున్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మంగళవారం జూమ్ ద్వారా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆత్మగౌరవాన్ని చంపుకుని అధికారం కోసం ముఖ్యమంత్రి కెసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ పదవులను పట్టుకుని వేలాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఇతరుల ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడుతున్న నేతలు తాము ఎంత ఆత్మగౌరవంతో ఉన్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ‘పల్లా రాజేశ్వర్ రెడ్డి 150 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి బొటాబొటీ ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచావు. ఈటెల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారనే విషయంపై విమర్శలు చేసే అర్హతలు నీకు ఎక్కడ’ అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో కోటి ఎకరాల్లో సాగు జరుగుతుంది. దేశానికి కావాల్సినంత తిండి పెట్టే స్థితికి రాష్ట్రం చేరిందని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన గన్నీ బ్యాగులను కూడా సమకూర్చి లేని దుస్థితిలో ఉన్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు. దేశంలో ఎక్కడలేని పథకాలు ఇక్కడ అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు.. బిజెపి పాలిత ప్రాంతాల్లో అక్కడి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారు ఆ హామీలను అమలు పరుస్తూ పాలన సాగిస్తున్నారు.. మీలా రైతులకు రుణమాఫీ చేస్తామని, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు పరుస్తామని, ఎస్సీలను ముఖ్యమంత్రి చేస్తామని శైలిని హామీ ఇచ్చింది మీ ముఖ్యమంత్రి కాదా అని ఆమె ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూములు, గొర్రెల పంపిణీ పథకాలు ఎలా అమలు అవుతున్నాయో ప్రజలకు తెలియదా అని డీకే అరుణ ప్రశ్నించారు.

విమర్శలు వచ్చినపుడల్లా బిజెపి పాలిస్తున్న రాష్ట్రాల్లో ఈ పథకాల అమలులో అవుతున్నాయా అని ప్రశ్నించడం వారి చేతకానితనానికి నిదర్శనమన్నారు. ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలు చెబుతూ పోతుంటే చూస్తూ ఊరుకోబోమని డీకే అరుణ స్పష్టం చేశారు.

రూ.100 కోట్లు మంజూరు

కేంద్ర ప్రభుత్వం క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాకు 100 కోట్ల రూపాయలను కేటాయించిందని డీకే అరుణ చెప్పారు. దేశంలోని 11 రాష్ట్రాలలో అధిక దిగుబడి వస్తున్న పంటలను, పండ్లను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆమె చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాలలో మామిడిపండ్ల రైతులను ప్రోత్సహించేందుకు ఎంపిక చేసిందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ చెప్పారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే మామిడి పండ్లు జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో మంచి గుర్తింపు పొందాయని మామిడి దిగుబడిని సాధిస్తున్నారు రైతులను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాలను క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎంపిక చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ పథకం అమలుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తుందని.దీని ద్వారా మామిడి రైతులకు మరింత మేలు జరగడంతో పాటు, ఈ జిల్లాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుందని అరుణ పేర్కొన్నారు.. ఈ జూమ్ మీటింగ్ లో ఆయా జిల్లాల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:    

Similar News