అంధకారాన్ని తొలగించే సమయమిదే.. అమెరికాలో దీపావళి సెలబ్రేషన్స్

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలో పలువురు అధికారులు మరియు యూఎస్ చట్టసభ సభ్యులు క్యాపిటల్ హిల్‌లో భారతీయ ప్రవాసులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. క్యాపిటల్ హిల్ వద్ద దీపావళి వేడుకను ఇండియాస్పోరా నిర్వహించింది. కార్యక్రమంలో ప్రవాసులు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కేబినెట్‌లో పనిచేస్తున్న అగ్రశ్రేణి భారతీయ అమెరికన్లలో కొందరిని సత్కరించారు. దీపావళి వేడుకకు సంప్రదాయ సూచిక అయిన ‘దియా’ను వెలిగించి, పలువురు చట్టసభ సభ్యులు మాట్లాడారు. US: Several officials of White House & […]

Update: 2021-10-27 10:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలో పలువురు అధికారులు మరియు యూఎస్ చట్టసభ సభ్యులు క్యాపిటల్ హిల్‌లో భారతీయ ప్రవాసులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. క్యాపిటల్ హిల్ వద్ద దీపావళి వేడుకను ఇండియాస్పోరా నిర్వహించింది. కార్యక్రమంలో ప్రవాసులు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కేబినెట్‌లో పనిచేస్తున్న అగ్రశ్రేణి భారతీయ అమెరికన్లలో కొందరిని సత్కరించారు. దీపావళి వేడుకకు సంప్రదాయ సూచిక అయిన ‘దియా’ను వెలిగించి, పలువురు చట్టసభ సభ్యులు మాట్లాడారు.

ఈ సందర్భంగా వైస్ అడ్మిరల్ సర్జన్ వివేక్ మూర్తి మాట్లాడుతూ.. గత ఒకటిన్నర సంవత్సర కాలంలో ప్రపంచం కొవిడ్ పాండమిక్ వంటి అంధకారంలో మగ్గిపోయిందని, ప్రస్తుతం ఆ చీకట్లను తొలిగించాల్సిన సమయం వచ్చిందన్నారు. మనమంతా దీపావళి పండుగ జరుపుకోవడం అత్యంత ముఖ్యమని.. ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో కూడా చర్చించుకోవాల్సిన సమయమిదని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సభ్యుడు అమీ బేరా, ప్రమీలా జయపాల్‌, కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా, కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి సంఘ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు.

Tags:    

Similar News