ఒకే సారి ఐదుగురితో ప్రేమ.. నటి దివ్య దర్శిని
దిశ, సినిమా: కాఫీ విత్ డీడీ, జోడీ నెం.1 షోస్‌తో పాపులర్ అయిన యాంకర్, యాక్టర్ దివ్య దర్శిని తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చింది. తన ఫ్రెండ్, అసిస్టెంట్ డైరెక్టర్ అయిన శ్రీకాంత్ రవిచంద్రన్‌ను పెళ్లి చేసుకున్న ఆమె 2017లో విడిపోయింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ అభిమాని.. మీ పాస్ట్ ప్రజెంట్ లైఫ్‌పై ఎఫెక్ట్ చూపుతుందా? అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా గతాన్ని తలుచుకుంటూ […]
దిశ, సినిమా: కాఫీ విత్ డీడీ, జోడీ నెం.1 షోస్‌తో పాపులర్ అయిన యాంకర్, యాక్టర్ దివ్య దర్శిని తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చింది. తన ఫ్రెండ్, అసిస్టెంట్ డైరెక్టర్ అయిన శ్రీకాంత్ రవిచంద్రన్‌ను పెళ్లి చేసుకున్న ఆమె 2017లో విడిపోయింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ అభిమాని.. మీ పాస్ట్ ప్రజెంట్ లైఫ్‌పై ఎఫెక్ట్ చూపుతుందా? అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా గతాన్ని తలుచుకుంటూ బాధపడుతుంటే జీవితంలో ముందుకు వెళ్లలేమని తెలిపింది. ఇక లైఫ్‌లో సెకండ్ లవ్‌పై నమ్మకముందా? అని మరో అభిమాని ప్రశ్నించగా.. ఇది సినిమా కాదు కదా అని తెలిపింది. లవ్ రెండోదా? మూడోదా? కాదు.. మన జీవితంలో ప్రేమ వస్తూ పోతూ ఉంటుంది. అది మన లైఫ్‌లో పార్ట్. కానీ ఒకేసారి నలుగురు – ఐదుగురు వ్యక్తులతో ప్రేమలో పడటం తప్పని అభిప్రాయపడింది.
https://twitter.com/Mysteri13472103/status/1393613589433356289?s=20