ఎవరిని వారే కాపాడుకోవాలి.. అరాచకాలకు పాల్పడొద్దు
దిశ, మహబూబాబాద్: కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న క్రమంలో ముస్లిం సోదరులు బక్రీద్ సంబురాలు ఇళ్లలోనే జరుపుకుని మతసామరస్యంలో ముందుకెళ్లాలని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు హిందూ, ముస్లిం భేదం లేకుండా కలిసి మెలిసి సంతోషంగా పండుగలు జరుపుకుంటారని తెలిపారు. కానీ కరోనా మహమ్మారికి ఎవరూ అతీతులు కాదన్నారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ఎవరినీ వారే కాపాడుకోవాలన్నారు. ముఖ్యంగా జిల్లాలో గోవధ లాంటి అరాచకాలకు పాల్పడొద్దని కోరారు. […]
దిశ, మహబూబాబాద్: కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న క్రమంలో ముస్లిం సోదరులు బక్రీద్ సంబురాలు ఇళ్లలోనే జరుపుకుని మతసామరస్యంలో ముందుకెళ్లాలని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు హిందూ, ముస్లిం భేదం లేకుండా కలిసి మెలిసి సంతోషంగా పండుగలు జరుపుకుంటారని తెలిపారు. కానీ కరోనా మహమ్మారికి ఎవరూ అతీతులు కాదన్నారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ఎవరినీ వారే కాపాడుకోవాలన్నారు. ముఖ్యంగా జిల్లాలో గోవధ లాంటి అరాచకాలకు పాల్పడొద్దని కోరారు. గోవులను ఎగుమతి చేసినట్టు తెలిస్తే సమాచారం ఇవ్వాలని తెలిపారు.