పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లపై అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్..
దిశ,మెదక్: నామినేషన్ ప్రక్రియ ముగిసినందున పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించవలసిందిగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మెదక్ స్థానిక సంస్థల మండలి ఎన్నికలకు నియమించిన నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 16 నుండి నామినేషన్ల స్వీకరణ చేపట్టగా 7గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,027 మంది జెడ్.పి.టి.సి, ఎం.పి.టి.సి, మున్సిపల్ కౌన్సిలర్ […]
దిశ,మెదక్: నామినేషన్ ప్రక్రియ ముగిసినందున పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించవలసిందిగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మెదక్ స్థానిక సంస్థల మండలి ఎన్నికలకు నియమించిన నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 16 నుండి నామినేషన్ల స్వీకరణ చేపట్టగా 7గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,027 మంది జెడ్.పి.టి.సి, ఎం.పి.టి.సి, మున్సిపల్ కౌన్సిలర్ ఓటర్లకు గాను 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు.
ఈ సందర్భంగా నోడల్ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లకు, కౌంటింగ్ రోజు మెదక్‌లో పోలిసు బందోబస్తు ఏర్పాటు చూడవలసినదిగా డి.ఎస్.పి సైదులుకు సూచించారు. పోలింగ్‌కు ప్రిసైడింగ్ అధికారులుగా ఏం.పి.ఓ.లతో పాటు ఇతర సిబ్బందిని, అదేవిధంగా నాలుగు టేబుళ్లలో జరిగే కౌంటింగ్‌కు సిబ్బందిని ఏర్పాటు చేయవలసినదిగా జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. బ్యాలెట్ పేపర్ ముద్రణ పనులు చూడవలసినదిగా డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్ ను, పోలింగ్ ఎన్నికల సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం ఏర్పాటు చేయవలసిందిగా జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన పనులు చూడవలసిందిగా ఇతర శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో సహాయ ఎన్నికల అధికారి రమేష్, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ. శైలేష్, ఎన్నికల నోడల్ అధికారులు, కలెక్టరేట్ ఏ.ఓ, సూపరింటెండెంట్ శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.