సెక్రటేరియట్ ఉద్యోగులకు ఆనందయ్య మందు పంపిణీ
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సచివాలయంలో ఉద్యోగులకు ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి సహకారంతో ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల భవిష్యత్ దృష్ట్యా ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సచివాలయంలో 2 వేల మంది ఉద్యోగులకు పంపిణీ చేస్తామన్నారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు సైతం అందిస్తామన్నారు. ఆనందయ్య మందు ఇమ్యూనిటీ […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సచివాలయంలో ఉద్యోగులకు ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి సహకారంతో ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల భవిష్యత్ దృష్ట్యా ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సచివాలయంలో 2 వేల మంది ఉద్యోగులకు పంపిణీ చేస్తామన్నారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు సైతం అందిస్తామన్నారు. ఆనందయ్య మందు ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తోందని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ వల్ల సెక్రటేరియట్లో పలువురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం బాధకలిగించిందని వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.