ఆదివారం వస్తే చాలు.. ఆ గ్రామానికి క్యూ కడుతున్న జనాలు

Update: 2022-01-16 10:13 GMT


దిశ, సారంగాపూర్: వారంలో గురువారం ఆదివారం వస్తే చాలు జనాలు ఆ గ్రామానికి క్యూ కడుతున్నారు. మండల కేంద్రంలో పెండల్ ధరి గ్రామంలో ఆత్రం నాగోరావు అనే వ్యక్తి తమ పూర్వీకుల నుండి మూలికా వైద్యం నేర్చుకోవడంతో స్వగ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వందలాది మందికి మూలికా వైద్యంతో నయం చేస్తున్నాడు. స్వయంగా అడవిలోకి వెళ్లి ఔషధ మొక్కలు సేకరించి వాటి నుంచి కషాయం తయారు చేసి పక్షవాతం, పిల్లలకి పిడుసు, కిడ్నీలో రాళ్లకు, కిడ్నీ వాపుకు, హర్ష మొలలకు, షుగర్ వ్యాధి, అన్ని రకాల క్యాన్సర్ రోగులకు చెట్ల మందుల ద్వారా నయం చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన చుట్టుపక్క గ్రామాల వారే కాకుండా మహారాష్ట్ర, బొకర్, నాందేడ్, కిన్వట్ ల నుంచి కూడా తరలివస్తున్నారు. తన పూర్వీకుల నుంచి అనాదిగా వస్తుఆదివారం వస్తే చాలు.. ఆ గ్రామానికి క్యూ కడుతున్న జనాలున్న సాంప్రదాయన్ని తాను కొనసాగిస్తున్నాని అత్రం నాగో రావు పేర్కొన్నారు. 

Tags:    

Similar News