కేవలం 49 రూపాయలకే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్!

దిశ, ఫీచర్స్: భారతదేశ యూజర్ల కోసం ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్(Disney+ Hotstar)’ రెండు కొత్త మొబైల్ ప్లాన్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్స్, స్టాండర్డ్ సబ్‌స్క్రిప్షన్స్‌ కంటే చౌకగా లభించనుండగా.. సింగిల్-స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆకట్టుకునే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టినట్లు నిపుణులు చెబుతున్నారు. ‘అమెజాన్, జియో’ ప్లాట్‌ఫామ్స్ తమ ప్లాన్స్ ధరలు పెంచినప్పటికీ నెట్‌ఫ్లిక్స్ మాత్రం రేట్లను తగ్గించి కొత్త కస్టమర్స్‌ను ఆకర్షించే ప్రయత్నం చేసింది. కాగా హాట్‌‌స్టార్ కూడా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ బాటలోనే నడుస్తోంది.  నెట్‌ఫ్లిక్స్ […]

Update: 2021-12-22 05:07 GMT

దిశ, ఫీచర్స్: భారతదేశ యూజర్ల కోసం ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్(Disney+ Hotstar)’ రెండు కొత్త మొబైల్ ప్లాన్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్స్, స్టాండర్డ్ సబ్‌స్క్రిప్షన్స్‌ కంటే చౌకగా లభించనుండగా.. సింగిల్-స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆకట్టుకునే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టినట్లు నిపుణులు చెబుతున్నారు. ‘అమెజాన్, జియో’ ప్లాట్‌ఫామ్స్ తమ ప్లాన్స్ ధరలు పెంచినప్పటికీ నెట్‌ఫ్లిక్స్ మాత్రం రేట్లను తగ్గించి కొత్త కస్టమర్స్‌ను ఆకర్షించే ప్రయత్నం చేసింది. కాగా హాట్‌‌స్టార్ కూడా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ బాటలోనే నడుస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ ఇటీవలే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరలు తగ్గించినప్పటికీ ప్రస్తుతానికి నెలకు రూ. 149/- ఖర్చవుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న హాట్‌స్టార్.. గతంలో రూ.99/-గా ఉన్న నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ రేటును తగ్గించి ఇప్పుడు రూ. 49కే అందించేందుకు సిద్ధమైంది. ఈ కొత్త ప్లాన్ ప్రకటనలతో కూడుకున్నది కాగా 720p స్ట్రీమింగ్, స్టీరియో ఆడియో క్వాలిటీని ఇస్తుంది. ప్రస్తుతం సెలెక్టెడ్ Android యూజర్ల కోసం టెస్టింగ్ స్టేజ్‌లో ఉండగా.. పలువురు యూజర్లు Redditలో సతరు ప్లాన్‌ను వివరించే స్క్రీన్‌షాట్స్ షేర్ చేశారు. ఈ మేరకు డిస్నీ+ హాట్‌స్టార్.. కార్డ్, Paytm, PhonePe లేదా UPI చెల్లింపుల ద్వారా రూ.99 ఇంట్రడక్టరీ ప్లాన్‌ను రూ.49కి అందిస్తోంది. ఇదే క్రమంలో 6-నెలల సబ్‌స్క్రిప్షన్‌‌పైనా రూ. 100 తగ్గించడంతో ప్రస్తుత వినియోగదారులు ₹199కే ఈ ప్లాన్ పొందుతున్నారు.

ఇక డిస్నీ+ హాట్‌స్టార్‌ అందిస్తున్న వార్షిక సబ్‌స్క్రిప్షన్స్‌లో బేసిక్ (రూ. 499), సూపర్(రూ. 899), ప్రీమియం (రూ.1499) వంటి మూడు ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం వినియోగదారులు 4K వీడియో నాణ్యతతో ఒకేసారి 4 పరికరాల్లో సైన్‌అప్ చేయొచ్చు. సూపర్ యూజర్లు HD వీడియో క్వాలిటీతో 2 పరికరాలకు యాక్సెస్‌ పొందవచ్చు. బేసిక్ ప్లాన్ విషయానికొస్తే.. ఒకే మొబైల్ డివైజ్‌కు పరిమితం చేశారు.

Tags:    

Similar News