‘దిశ’ విచారణ కమిషన్ కీలక ప్రకటన

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనపై సుప్రీం కోర్టు విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కమిషన్ ఘటనకు సంబంధించి పలువురి సాక్షులను, ఆధారాలను, రికార్డులను పరిశీలించింది. తాజాగా కమిషన్ కార్యకలాపాల గురించి కమిషన్ కార్యదర్శి ఎస్. శశిధర్‌రెడ్డి మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్నా.. విచారణ కమిషన్ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. దిశ ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తుల […]

Update: 2020-07-17 05:22 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనపై సుప్రీం కోర్టు విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కమిషన్ ఘటనకు సంబంధించి పలువురి సాక్షులను, ఆధారాలను, రికార్డులను పరిశీలించింది. తాజాగా కమిషన్ కార్యకలాపాల గురించి కమిషన్ కార్యదర్శి ఎస్. శశిధర్‌రెడ్డి మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు.

కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్నా.. విచారణ కమిషన్ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. దిశ ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తుల నుంచి కీలక పత్రాలు, రికార్డులు, వాంగ్మూలాలు స్వీకరించడం ఇకపైనా కొనసాగుతుందని వివరించారు. ఈ సమాచారాన్ని కమిషన్ సభ్యులందరికీ పంపడం జరిగిందని తెలిపారు. ఘటనకు సంబంధించి అనేక మంది వ్యక్తులను విచారించాల్సి ఉండడంతో పాటు, వారి వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచాల్సి ఉన్నందున, అలాగే వారికి భద్రత కల్పించాల్సి ఉన్నందున ఆన్ లైన్ విచారణ సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చామని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News