‘దిశ’ ఎఫెక్ట్ : క్లస్టర్ కోఆర్డినేటర్ సుధాకర్ సస్పెన్షన్
దిశ, తుంగతుర్తి: తుంగతుర్తి మండల కేంద్రంలోని మహిళా సమాఖ్యలో క్లస్టర్ కోఆర్డినేటర్‌గా పని చేస్తున్న సుధాకర్‌పై జిల్లా అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. సీసీ సుధాకర్ సుమారు 13 రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా కొంతమందితో కుమ్మక్కై రైతుల పొలాల వద్ద నుండి నేరుగా ధాన్యం లారీలను మిల్లులకు పంపించారు. ఆయన తీరుపై అనుమానం వచ్చిన అన్నారం గ్రామ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. […]
దిశ, తుంగతుర్తి: తుంగతుర్తి మండల కేంద్రంలోని మహిళా సమాఖ్యలో క్లస్టర్ కోఆర్డినేటర్‌గా పని చేస్తున్న సుధాకర్‌పై జిల్లా అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. సీసీ సుధాకర్ సుమారు 13 రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా కొంతమందితో కుమ్మక్కై రైతుల పొలాల వద్ద నుండి నేరుగా ధాన్యం లారీలను మిల్లులకు పంపించారు. ఆయన తీరుపై అనుమానం వచ్చిన అన్నారం గ్రామ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అక్రమంగా ధాన్యం తరలిస్తున్న లారీని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దీనిపై తుంగతుర్తి తహసీల్దార్ రాంప్రసాద్ విచారణ జరిపి నివేదికను జిల్లా అధికారులకు పంపించారు.
అయితే విచారణలో సీసీది తప్పని తేలినా క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా జిల్లా అధికారులు వదిలేశారు. దీనిపై ఈ నెల 12న ‘దిశ’లో “తేలిన అధికారుల తప్పులు.. చర్యలు మాత్రం నిల్” అనే శీర్షికతో వార్త ప్రచురితం అయింది. ఈ వార్తపై స్పందించిన జిల్లా అధికారులు సోమవారం సంబంధిత క్లస్టర్ కోఆర్డినేటర్ సుధాకర్‌ను సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. సీసీ అక్రమాలను వెలుగులోకి తెచ్చిన ‘దిశ’ పత్రికపై మండల రైతులు, ప్రజాసంఘాల నాయకులు ప్రశంసలు గుప్పించారు.