ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మండలి చైర్మన్‌గా కీలకనేత?

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ శాసన మండలి నూతన చైర్మన్‌గా కొయ్య మోసేను రాజు పేరు పరిశీలనలో ఉన్నట్లు వైసీపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీగా మోసేను రాజు నియామకానికి సోమవారం గవర్నరు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. అయితే శాసన మండలి చైర్మన్‌గా పనిచేసిన షరీఫ్ పదవీకాలం ముగియడంతో కొత్త చైర్మన్ కోసం వైసీపీ వ్యూహం రచిస్తోంది. ఎంఏ షరీఫ్‌ చైర్మన్‌గా పదవీ విరమణ […]

Update: 2021-06-16 02:31 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ శాసన మండలి నూతన చైర్మన్‌గా కొయ్య మోసేను రాజు పేరు పరిశీలనలో ఉన్నట్లు వైసీపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీగా మోసేను రాజు నియామకానికి సోమవారం గవర్నరు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. అయితే శాసన మండలి చైర్మన్‌గా పనిచేసిన షరీఫ్ పదవీకాలం ముగియడంతో కొత్త చైర్మన్ కోసం వైసీపీ వ్యూహం రచిస్తోంది. ఎంఏ షరీఫ్‌ చైర్మన్‌గా పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో మైనారిటీ నుంచే కొత్తవారు వస్తారన్న ప్రచారం గతంలో జరిగింది. కానీ.. శాసనసభ సభాపతి పదవిని బీసీ వర్గానికి చెందిన తమ్మినేనికి ఇచ్చినందువల్ల మండలి ఛైర్మన్‌ పదవి ఎస్సీ వర్గానికి ఇవ్వాలని వైసీపీ ఓ ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

అందులో భాగంగానే మోసేను రాజు పేరు పరిశీలనకు వచ్చిందని తెలుస్తోంది. మోసేన్ రాజు శాసన మండలి చైర్మన్ అయితే ఏపీలో తొలి చైర్మన్‌గా రికార్డు సృష్టించినట్లే. గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా ప్రతిభాభారతిని నియమించింది టీడీపీ. ఇప్పటికీ తాము దళిత మహిళను అసెంబ్లీ స్పీకర్‌ను చేశామని చంద్రబాబు పదేపదే చెప్పుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో మోసేను రాజును చైర్మన్‌గా నియమిస్తే టీడీపీని రాజకీయంగా ఎదుర్కొనడంతోపాటు దళితులకు మరింత చేరువ కావొచ్చని పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉంటే డిప్యూటీ ఛైర్మన్‌ పదవి బీసీ లేదా మైనారిటీ వర్గానికి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. తొలుత శాసన మండలి చైర్మన్ పదవిని హిందూపురం నేత, ఎమ్మెల్సీ ఇక్బాల్ పేరు పరిశీలనలోకి వచ్చింది. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో మోసేను రాజు పేరు తెరపైకి వచ్చింది. ఇకపోతే డిప్యూటీ చైర్మన్‌గా జంగా కృష్ణమూర్తి లేదా ఇక్బాల్ ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News