నేడు ఇండియా, చైనా మధ్య చర్చ
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంపై భారత్, చైనా ఆర్మీ అధికారులు మరోసారి చర్చించనున్నారు. చివరిసారిగా ఏప్రిల్ 9న మీటింగ్ జరగగా, మూడు నెలల తర్వాత శనివారం మరోసారి ఇరుదేశాల కార్ప్స్ కమాండర్ స్థాయిలో 12వ రౌండ్ చర్చలు జరగనున్నాయి. ఈ భేటీ వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కు చైనా వైపున్న మోల్డోలో జరగనుంది. తూర్పు లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా హైట్స్‌లో మోహరించిన ఇరుదేశాల ఆర్మీ ఉపసంహరణే లక్ష్యంగా చర్చలు సాగనున్నట్టు భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. బలగాల ఉపసంహరణకు భారత్ […]
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంపై భారత్, చైనా ఆర్మీ అధికారులు మరోసారి చర్చించనున్నారు. చివరిసారిగా ఏప్రిల్ 9న మీటింగ్ జరగగా, మూడు నెలల తర్వాత శనివారం మరోసారి ఇరుదేశాల కార్ప్స్ కమాండర్ స్థాయిలో 12వ రౌండ్ చర్చలు జరగనున్నాయి. ఈ భేటీ వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కు చైనా వైపున్న మోల్డోలో జరగనుంది. తూర్పు లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా హైట్స్‌లో మోహరించిన ఇరుదేశాల ఆర్మీ ఉపసంహరణే లక్ష్యంగా చర్చలు సాగనున్నట్టు భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. బలగాల ఉపసంహరణకు భారత్ సిద్ధంగా ఉందని, అయితే, చైనా కూడా దీన్ని అమలుచేస్తేనే సాధ్యమైతుందని తెలిపాయి.