కరోనా వచ్చినా సరే.. బదిలీ తప్పదు!

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఆరేండ్లు గడిచినా.. తెలంగాణేతర అధికారుల పెత్తనమే ఇంకా నడుస్తోందా? స్వరాష్ట్ర స్వప్నం నెరవేరినా.. స్వాతంత్ర్య ఫలాలను అనుభవించలేక పోతున్నామా? రాష్ట్రంలోని పలు విభాగాల్లో బాసిజం కొనసాగుతోందా..? అనే అంశాలు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ విభాగంలో చర్చకొస్తున్నాయి. ఉన్నత స్థాయిలో తెలంగాణేతర అధికారులు ఒకే చోట ఏండ్ల తరబడి తిష్ఠ వేయడం కారణంగా ఆ ప్రాంతం వాళ్లకే తగిన ప్రాధాన్యత లభిస్తోందని, నేటికీ తెలంగాణ అధికారులు, సిబ్బంది ప్రాంతీయ, సామాజిక అంశాల పట్ల […]

Update: 2020-07-31 20:18 GMT

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఆరేండ్లు గడిచినా.. తెలంగాణేతర అధికారుల పెత్తనమే ఇంకా నడుస్తోందా? స్వరాష్ట్ర స్వప్నం నెరవేరినా.. స్వాతంత్ర్య ఫలాలను అనుభవించలేక పోతున్నామా? రాష్ట్రంలోని పలు విభాగాల్లో బాసిజం కొనసాగుతోందా..? అనే అంశాలు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ విభాగంలో చర్చకొస్తున్నాయి. ఉన్నత స్థాయిలో తెలంగాణేతర అధికారులు ఒకే చోట ఏండ్ల తరబడి తిష్ఠ వేయడం కారణంగా ఆ ప్రాంతం వాళ్లకే తగిన ప్రాధాన్యత లభిస్తోందని, నేటికీ తెలంగాణ అధికారులు, సిబ్బంది ప్రాంతీయ, సామాజిక అంశాల పట్ల వివక్షతకు గురవుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి.

దిశ, క్రైమ్ బ్యూరో: ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ప్రజల భద్రతా అంశాలే ప్రధాన లక్ష్యంగా విధులు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ విభాగంలో తెలంగాణేతర అధికారులు తిష్ఠ వేస్తున్నారు. సాధారణంగా ఈ విభాగంలో ప్రతి 2-3 ఏండ్లకే బదిలీలు అవుతుంటాయి. కానీ కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఒకేచోట, మరీ ముఖ్యంగా ప్రధాన కార్యాలయంలో 10 నుంచి 15 ఏండ్లు దాకా సర్వీసులో కూర్చున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా ఇక్కడి ప్రాంతానికి చెందిన అధికారులు వివక్షత, అవమానాలకు గురవుతున్నట్టు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 బెటాలియన్లలో దాదాపు 11 బెటాలియన్లకు తెలంగాణేతర అధికారులే కమాండెంట్లుగా కొనసాగుతున్నారంటే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. దీంతో డిపార్ట్‌మెంట్‌లో ఈ అధికారులు చెప్పిందే ఆదేశాలుగా అమలవుతున్నట్టు తెలుస్తోంది. తన అనుకున్న వాళ్లకు అధిక ప్రయోజనాలుగా భావించే పోస్టింగ్‌లు కేటాయిస్తున్నట్టు విమర్శలున్నాయి. ముఖ్యంగా అత్యధికంగా హెచ్ఆర్ఏ ఎక్కడ వస్తోందో.. అక్కడ తమకిష్టమైన వారికి, తమ చెప్పు చేతుల్లో ఉండే వారికి మాత్రమే పోస్టింగ్ లు కేటాయిస్తూ.. మిగతా వారికి హెచ్ఆర్ఏ తక్కువ వచ్చే దూర ప్రాంతాలకు బదిలీలు చేస్తున్నారంటూ పలువురు అధికారులు వాపోతున్నారు. అసలే పోలీస్ శాఖ కావడం, అందులో స్పెషల్ విభాగం అయినందున ప్రశ్నిస్తే ఎలాంటి పరిణామాలను చవిచూడాల్సి వస్తుందోనంటూ స్థానిక అధికారులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

గిరిజనులంటే మరీ చులకనగా..

తెలంగాణ స్పెషల్ పోలీస్ విభాగంలో గిరిజన అధికారులకు పోస్టింగ్ కేటాయింపుల్లో ఉన్నతాధికారులు వివక్షతను ప్రదర్శిస్తున్నారంటూ గిరిజన ఐక్య వేదిక నాయకులు ఇటీవల బహిరంగంగానే ప్రస్తావించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ బెటాలియన్‌లో ఆర్ఐ స్థాయి అధికారి సెలవుపై వెళితే.. అదే బెటాలియన్‌లో అత్యంత సీనియర్‌గా ఉన్న గిరిజన ఆర్ఎస్ఐకు ఇన్‌చార్జి ఇవ్వకుండా.. మరోచోట నుంచి ఐదేండ్లు జూనియర్‌గా ఉన్న మరో ఆర్ఎస్ఐకి బాధ్యతలు అప్పగించి గిరిజన సీనియర్ అధికారిని అవమానపర్చారు. ఇదిలా ఉండగా మరో బెటాలియన్‌లో తనపై అధికారి తప్పును ప్రశ్నించినందుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, అసలు ఫిర్యాదు విషయాన్ని పక్కకు నెట్టి ఒకే వర్గానికి చెందిన అధికారులంతా ఏకమయ్యారు. ఫలితంగా కొన్నాళ్లు గడిచాకా.. అతని వద్ద ఏదో తప్పు ఉన్నట్టుగా చూపించి రివర్స్ మెమో జారీ చేశారు. అంతే కాకుండా, ప్రశ్నించినందుకు బహుమానంగా మరోచోటికి బదిలీ చేయడం గమleర్హం. ఇటీవల ఓ అధికారికి కరోనా పాజిటివ్ నిర్థారణ కాగా, తన కుటుంబానికి దగ్గరగా డ్యూటీ ఇవ్వకుండా.. దూర ప్రాంతానికి బదిలీ చేశారు. దీంతో ఆ పేషెంట్ ప్రస్తుతం డ్యూటీలోనే క్వారంటైన్ చేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం కొవిడ్ లాంటి ఆపత్కాలంలోనూ కింది స్థాయి అధికారుల పట్ల ఉన్నతాధిరులు ఇష్టానుసారంగా వ్యవBరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: డాక్టర్ రాజ్‌కుమార్ జాదవ్, గిరిజన ఐక్య వేదిక

టీఎస్ఎస్పీ విభాగంలో గిరిజన పోలీసు అధికారులను తీవ్రంగా వేధిస్తున్నారు. గిరిజనుల పట్ల చిన్నచూపు, వివక్షత కొనసాగుతోంది. ఫలితంగా బదిలీలు, పోస్టింగ్ లలో పలు అవమానాలు ఎదురవుతున్నాయి. కొన్నేళ్లుగా ఒకేచోట కొనసాగుతూ వాళ్లకు అనుకూలమైన అధికారులను ఒకలా, వారి మాట వినని వారిని మరోలా చూస్తున్నారు. 60 ఏండ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నా.. ఫలితం లేకుండా పోతోంది. జరుగుతున్న పరిణామాలపై డీజీపీతో పాటు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నాం. ఇప్పటికే వారి అపాయింట్‌మెంట్ కోరాం.

Tags:    

Similar News