రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ ధరలపై కీలక నిర్ణయం

దిశ, వెబ్‌డెస్క్ : సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా పెంచిన రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరలను మళ్లీ తగ్గిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. విజయవాడ డివిజన్‌లోని రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరలను రూ. 10కి తగ్గిస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అన్‌రిజర్వుడ్ రైళ్లు పునఃప్రారంభమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అయితే సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం […]

Update: 2021-09-28 22:35 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా పెంచిన రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరలను మళ్లీ తగ్గిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. విజయవాడ డివిజన్‌లోని రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరలను రూ. 10కి తగ్గిస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

అన్‌రిజర్వుడ్ రైళ్లు పునఃప్రారంభమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అయితే సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం ధరలను రూ. 50 నుంచి రూ. 20కి తగ్గించిన విషయం తెలిసిందే. ప్లాట్‌ఫాం ధరల సమస్యను సాధ్యమైనంత వరకూ తగ్గిస్తామని రైల్వేశాఖ తెలిపింది.

Tags:    

Similar News