నో వ్యాక్సిన్స్.. పంపిణీకి బ్రేక్

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమానికి బ్రేక్ పడింది. వ్యాక్సిన్ డోసుల కోరతతో టీకా మహోత్సవాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. నిన్నటితో వ్యాక్సిన్ డోసులు అయిపోగా..  వ్యాక్సిన్ డోస్‌లు పంపించాల్సిందిగా ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు వ్యాక్సిన్ డోసులు పంపాల్సిందిగా ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో ఇవాళ రాత్రికి 4,30,040 వ్యాక్సిన్ డోస్‌లు ఏపీకి రానున్నాయి. ఇవి వస్తే ఏపీలోకి రేపటి నుంచి […]

Update: 2021-04-11 22:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమానికి బ్రేక్ పడింది. వ్యాక్సిన్ డోసుల కోరతతో టీకా మహోత్సవాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. నిన్నటితో వ్యాక్సిన్ డోసులు అయిపోగా.. వ్యాక్సిన్ డోస్‌లు పంపించాల్సిందిగా ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు వ్యాక్సిన్ డోసులు పంపాల్సిందిగా ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ కూడా రాశారు.

ఈ క్రమంలో ఇవాళ రాత్రికి 4,30,040 వ్యాక్సిన్ డోస్‌లు ఏపీకి రానున్నాయి. ఇవి వస్తే ఏపీలోకి రేపటి నుంచి వ్యాక్సిన్ ప్రక్రియ యథాతధంగా జరగనుంది. ఇప్పటివరకు ఏపీకి 40,44,600 కరోనా వ్యాక్సిన్ డోస్‌లు వచ్చాయి.

Tags:    

Similar News