హీరో రామ్‌ను సర్‌ప్రైజ్ చేసిన లెజెండరీ డైరెక్టర్

దిశ, సినిమా : యంగ్ హీరో రామ్ పోతినేని అండ్ టీమ్‌(#RAPO19)ను సర్‌ప్రైజ్ చేశారు డైరెక్టర్ శంకర్. లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభం కాగా.. రామ్, కృతిశెట్టి, నదియాపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతుండగా.. మూవీ సెట్‌లోకి డైరెక్టర్ శంకర్ ఎంటరై సర్‌ప్రైజ్ ఇచ్చాడు. షూటింగ్ సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటూ.. మూవీ యూనిట్‌తో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశారు. ఈ సందర్భంగా […]

Update: 2021-07-14 08:18 GMT

దిశ, సినిమా : యంగ్ హీరో రామ్ పోతినేని అండ్ టీమ్‌(#RAPO19)ను సర్‌ప్రైజ్ చేశారు డైరెక్టర్ శంకర్. లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభం కాగా.. రామ్, కృతిశెట్టి, నదియాపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతుండగా.. మూవీ సెట్‌లోకి డైరెక్టర్ శంకర్ ఎంటరై సర్‌ప్రైజ్ ఇచ్చాడు. షూటింగ్ సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటూ.. మూవీ యూనిట్‌తో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస చిట్టూరి మాట్లాడుతూ.. లెజెండరీ డైరెక్టర్ తమ సెట్‌లోకి రావడం చాలా హ్యాపీగా ఉందని, ప్రశంసలతో పాటు ఆయనిచ్చిన విలువైన సూచనలు తప్పకుండా పాటిస్తామని తెలిపారు. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న చిత్రానికి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

https://www.facebook.com/dishatelugunews

Tags:    

Similar News