రాజధాని కేసులపై ప్రత్యక్ష విచారణ : హైకోర్టు
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ రాజధాని రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రతిపక్షాలు సవాల్ చేస్తుండటంతో అవి కాస్త కోర్టులో నలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజధాని అంశానికి సంబంధించిన కేసులను ప్రత్యక్షంగా విచారించాలని హైకోర్టు భావిస్తోంది. భౌతికదూరం పాటించి సెప్టెంబర్ 21 నుంచి రాజధాని అమరావతిపై రోజువారీగా విచారణ చేపట్టడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ధర్మాసనం ప్రకటించింది. దీంతో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాల రద్దు, ప్రభుత్వ కార్యాలయాల తరలింపు […]
దిశ, వెబ్‌డెస్క్ :
ఏపీ రాజధాని రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రతిపక్షాలు సవాల్ చేస్తుండటంతో అవి కాస్త కోర్టులో నలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజధాని అంశానికి సంబంధించిన కేసులను ప్రత్యక్షంగా విచారించాలని హైకోర్టు భావిస్తోంది. భౌతికదూరం పాటించి సెప్టెంబర్ 21 నుంచి రాజధాని అమరావతిపై రోజువారీగా విచారణ చేపట్టడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ధర్మాసనం ప్రకటించింది.
దీంతో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాల రద్దు, ప్రభుత్వ కార్యాలయాల తరలింపు లాంటి అంశాలతో ముడిపడిన 56 వ్యాజ్యాలు హైకోర్టులో పెండిగ్‌లో ఉన్నాయి. కాగా, వీటన్నింటినీ ప్రత్యక్షంగా విచారించేందుకు హైకోర్టు సంసిద్ధత వ్యక్తంచేసింది.