ఆ కటుంబంలో ఒకరికి గెజిటెడ్ ఉద్యోగం ఇస్తాం

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా బారిన పడి మృతిచెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ నరేష్ కుటుంబంలో ఒకరికి గెజిటెడ్ ఉద్యోగం కల్పిస్తామని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అంతేగాకుండా బాధిత కుటుంబానికి పరిహారం ఇచ్చే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. మంగళవారం కోఠిలోని డీహెచ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… కరోనా బారిన పడిన వారికి, […]

Update: 2020-08-25 08:29 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా బారిన పడి మృతిచెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ నరేష్ కుటుంబంలో ఒకరికి గెజిటెడ్ ఉద్యోగం కల్పిస్తామని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అంతేగాకుండా బాధిత కుటుంబానికి పరిహారం ఇచ్చే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. మంగళవారం కోఠిలోని డీహెచ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… కరోనా బారిన పడిన వారికి, సరైన వైద్యం అందడం లేదని కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గాంధీ, టిమ్స్, నిమ్స్‌లలో మెరుగైన వసతులు కల్పించామని చెప్పారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 శాతం పడకలు ఖాళీగా ఉన్నాయని, ఎక్కడా బెడ్ల కొరత లేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మెరుగైన వైద్యం అందుతోందని, దీంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వచ్చి వైద్య సేవలు పొంతున్నారని తెలిపారు. కరోనా విషయంలో ప్రభుత్వం చేస్తున్న సూచనలను ప్రజలు పాటిస్తుండటంతో సెప్టెంబర్ 2 నాటికి రాష్ట్రంలో కనిష్ట స్థాయికి కేసులు తగ్గుతాయని ఆయన జోస్యం చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రులతో కలిసి స్పెషల్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి యాజమాన్యాలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నామని, 104 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తేవడంతో ప్రైవేట్ వైద్య సేవలపై చాలా తక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.

ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో ఎంతమంది రోగులు వస్తే అంతమందికి ప్రభుత్వం నిర్ణయించిన ప్యాకేజీ ప్రకారం వైద్య సేవలు అందించాలని, 50 శాతం పడకలే ఇస్తామని ఎవరైనా వైద్యం అందించేందుకు నిరాకరిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసులలో కేవలం 1 నుంచి 2 శాతం రోగుల పరిస్థితి మాత్రమే సీరియస్‌గా ఉందని, మరణాల శాతం 0.7 (ఒకటికంటే తక్కువ) ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి రోజు 50 వేల కరోనా టెస్టులు చేస్తున్నట్టు శ్రీనివాస రావు చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేశామని, రోగులకు సేవ చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని, ప్రజలు వైద్యులు, సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News