కరోనాతో టాలీవుడ్ దర్శకుడు మృతి
దిశ, సినిమా : సినిమా దర్శకుడు, రచయత ఎన్. సాయి బాలాజీ ప్రసాద్(ఎన్ . వర ప్రసాద్ ) కరోనాతో చనిపోయారు. గచ్చిబౌలిలోని టిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. రియల్ స్టార్ శ్రీహరి హీరోగా వచ్చిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన.. సిరి, అపరంజి, హాలాహలం, సీరియల్స్‌కు కూడా డైరెక్ట్ చేశారాయన. మెగాస్టార్ చిరంజీవి ‘బావగారు బాగున్నారా’ సినిమాకు స్క్రీన్‌ప్లే సమకూర్చిన వారిలో ఒకరైన ఆయన స్వస్థలం తిరుపతి కాగా.. […]
దిశ, సినిమా : సినిమా దర్శకుడు, రచయత ఎన్. సాయి బాలాజీ ప్రసాద్(ఎన్ . వర ప్రసాద్ ) కరోనాతో చనిపోయారు. గచ్చిబౌలిలోని టిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. రియల్ స్టార్ శ్రీహరి హీరోగా వచ్చిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన.. సిరి, అపరంజి, హాలాహలం, సీరియల్స్‌కు కూడా డైరెక్ట్ చేశారాయన. మెగాస్టార్ చిరంజీవి ‘బావగారు బాగున్నారా’ సినిమాకు స్క్రీన్‌ప్లే సమకూర్చిన వారిలో ఒకరైన ఆయన స్వస్థలం తిరుపతి కాగా.. భార్య గౌరి, కుమార్తె స్నేహ పూజిత ఉన్నారు. కాగా సాయి బాలాజీ ప్రసాద్ రవిరాజా పినిశెట్టి దర్శకత్వశాఖలో పనిచేశారు.