ప్రజావాణికి అధికారుల డుమ్మా
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి అధికారులు డుమ్మా కొడుతున్నారు.
దిశ, పెద్దేముల్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి అధికారులు డుమ్మా కొడుతున్నారు. ప్రతివారం నిర్వహించే ప్రజావాణిలో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ప్రజావాణికి హాజరై సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలని కలెక్టర్ పలుమార్లు ఆదేశించినప్పటికీ ప్రజావాణికి హాజరు కాలేకపోతున్నారు. పెద్దేముల్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ఎంపిడిఓ జర్నప్ప, వైద్య శాఖ అధికారి డాక్టర్ బుచ్చి బాబు, ఉపాధి హామీ శాఖ అధికారి ఏపీఓ నర్సింలు, ఈ మూడు శాఖల అధికారులు మాత్రమే పాల్గొన్నారు. మిగతా శాఖల అధికారులు హాజరుకాకపోవడం తో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో పెండింగ్‌లో సమస్యల పరిష్కారం గురించి ప్రజావాణిలో సంభందిత అధికారులకు విన్నవించుకునదమంటే ఆ శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడంతో సమస్యలను చెప్పుకోలేక ప్రజలు వెనుతిరుగల్సి వస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రతి వారం జరిగే ప్రజావాణికి హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకొని వచ్చే వారం ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.