తల్లి పరీక్ష అయిపోయేదాకా 5 నెలల బాబును ఆడించిన కానిస్టేబుల్
తెలంగాణలో ఆదివారం గ్రూప్-3 పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. నిన్న రెండు పేపర్లు పూర్తవ్వగా..సోమవారం పేపర్ -3 జరుగుతోంది.
దిశ, తాండూరు : తెలంగాణలో ఆదివారం గ్రూప్-3 పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. నిన్న రెండు పేపర్లు పూర్తవ్వగా..సోమవారం పేపర్ -3 జరుగుతోంది. ఈ క్రమంలోనే పరీక్ష రాసేందుకు వచ్చిన బాలింతలకు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ సాయం చేసింది. వివరాల్లోకి వెళితే.. కృష్ణవేణి అనే మహిళ గ్రూప్-3 పరీక్ష రాసేందుకు వెళ్లగా ఐదు నెలల బాబు అలనాపాలనాను అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ నర్సమ్మ చూసుకున్నారు.ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని శేర్లింగంపల్లికి చెందిన కృష్ణవేణి గ్రూప్ – 3 పరీక్షా రాస్తోంది. ఆమెకు 5 నెలల బాబు ఉన్నాడు. గ్రూప్ -3 పరీక్ష కోసం తాండూరు పట్టణం సింధూ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రానికి బాబుతో కలిసి వచ్చింది. కేంద్రంలోకి బాబు అనుమతి లేకపోవడంతో కేంద్రం వద్ద వీధుల్లో ఉన్న బషీరాబాద్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ నర్సమ్మ బాబును తీసుకుంది. తల్లి పరీక్ష రాసి వచ్చేంతవరకు బాబును జాగ్రత్తగా చూసుకుంది. బాబు ఏడవకుండా జో కొడుతూనే.. మరోవైపు బందోబస్తు విధులు నిర్వర్తించింది. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందుకు వచ్చిన సబ్ కలెక్టర్ చూసి అభినందించారు. తోటి ఉద్యోగులు, ఇతర శాఖల ఉద్యోగులు, సిబ్బంది కూడా నర్సమ్మను శభాష్.. అంటూ.. అభినందించారు. ఇదిలాఉండగా, గ్రూప్-3 పరీక్ష నేటితో ప్రశాంతంగా ముగిసింది.