లగచర్ల దాడి ఘటనలో పంచాయతీ కార్యదర్శి సస్పెండ్...
వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై జరిగిన దాడి ఘటనలో దౌల్తాబాద్ మండలం, సంగాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న
దిశ ప్రతినిధి వికారాబాద్ : వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై జరిగిన దాడి ఘటనలో దౌల్తాబాద్ మండలం, సంగాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న రాఘవేందర్ పాత్ర కీలకంగా ఉందని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగా సెక్రటరీ రాఘవేందర్ ను సస్పెండ్ చేస్తూ ఆదివారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా డీపీఓ జయసుధ వెల్లడించారు. ఇదిలా ఉంటే నిందితుడు పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ భార్య, కుటుంబ సభ్యులు మాత్రం రాఘవేందర్ ఎలాంటి తప్పు చేయలేదు అంటున్నారు. దాడి జరిగిన సమయంలో ఆయన సర్వే చేస్తున్నారు. దాడికి నా భర్తకు ఎలాంటి సంబంధం లేదు. కావాలనే పోలీసులు దౌర్జన్యంగా నా భర్తను అరెస్టు చేశారని రాఘవేందర్ భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.