మిస్ యూ విశాల్ : మిస్కిన్

విశాల్ హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన ‘డిటెక్టివ్’ చిత్రం సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. దీంతో హీరో, డైరెక్టర్‌ కలిసి ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు నిర్మాతగానూ వ్యవహరిస్తున్న విశాల్‌కు, డైరెక్టర్‌కు సినిమా బడ్జెట్ విషయంలో విభేదాలు తలెత్తడంతో మీడియా వేదికగా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇదే క్రమంలో డిటెక్టివ్ 2 నుంచి మిస్కిన్ తప్పుకోగా.. దర్శకత్వ బాధ్యతలను విశాల్ తీసుకున్నాడు. అయితే ఇంత యుద్ధం […]

Update: 2020-06-06 00:40 GMT

విశాల్ హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన ‘డిటెక్టివ్’ చిత్రం సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. దీంతో హీరో, డైరెక్టర్‌ కలిసి ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు నిర్మాతగానూ వ్యవహరిస్తున్న విశాల్‌కు, డైరెక్టర్‌కు సినిమా బడ్జెట్ విషయంలో విభేదాలు తలెత్తడంతో మీడియా వేదికగా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇదే క్రమంలో డిటెక్టివ్ 2 నుంచి మిస్కిన్ తప్పుకోగా.. దర్శకత్వ బాధ్యతలను విశాల్ తీసుకున్నాడు. అయితే ఇంత యుద్ధం జరిగాక కూడా విశాల్‌ను చాలా మిస్ అవుతున్నానని మిస్కిన్ చెబుతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. విశాల్‌పై తనకు చాలా ప్రేమాభిమానం ఉందన్న ఆయన.. తను నాకు సోదరుడిలాంటి వాడని చెప్పాడు. తను గొప్ప నటుడని.. సినిమాల్లో సాహసాలు చేసే క్రమంలో ప్రాణాలు పోయినా పరవాలేదని అనుకుంటాడన్నాడు. విశాల్ నిప్పులాంటి మనిషని ప్రశంసలు కురిపించాడు. ‘ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు తరుచూ కలిసే వాళ్లం.. విశాల్ వారానికి రెండుసార్లైనా ఆఫీస్‌కు వచ్చి నన్ను కలిసేవాడు. కానీ ఈ గొడవల కారణంగా కలవలేకపోతుండటంతో తనను చాలా మిస్ అవుతున్నాను’ అని తెలిపాడు మిస్కిన్.

Tags:    

Similar News