బండ్ల గణేష్ భావోద్వేగం.. ఆయన లేకపోతే కరోనాతో చచ్చిపోయేవాడిని..

దిశ, వెబ్‌డెస్క్: బండ్ల గణేష్.. టాలీవుడ్ లో ఈ పేరు తెలియని వారుండరు. మరీ ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కి ఈయన ఒక స్టార్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ని దేవుడిగా కొలిచే గణేష్.. ఆయన గురించి చెప్పమంటే జీవితాంతం చెప్తూనే ఉంటాడు. ఇక రాజకీయాలలోకి వెళ్లి నాలుక్కరుచుకొని మళ్లీ బుద్దిగా సినిమాలను నిర్మిస్తున్న గణేష్ తాజాగా కరోనా సమయంలో ఆయన పడిన బాధలను వివరించారు. రెండు సార్లు కరోనాను జయించి బండ్ల బయటపడిన విషయం […]

Update: 2021-08-25 01:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: బండ్ల గణేష్.. టాలీవుడ్ లో ఈ పేరు తెలియని వారుండరు. మరీ ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కి ఈయన ఒక స్టార్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ని దేవుడిగా కొలిచే గణేష్.. ఆయన గురించి చెప్పమంటే జీవితాంతం చెప్తూనే ఉంటాడు. ఇక రాజకీయాలలోకి వెళ్లి నాలుక్కరుచుకొని మళ్లీ బుద్దిగా సినిమాలను నిర్మిస్తున్న గణేష్ తాజాగా కరోనా సమయంలో ఆయన పడిన బాధలను వివరించారు. రెండు సార్లు కరోనాను జయించి బండ్ల బయటపడిన విషయం తెల్సిందే. ఆ సమయంలో ఆయన పడిన కష్టాలను ఒక చానెల్ ఇంటర్వ్యూ లో అభిమానులకు తెలిపారు.

“ఇటీవల నాకు రెండో సారి కరోనా వచ్చింది. ఇంట్లో అందరు చాలా భయపడిపోయారు. సెకండ్ వేవ్ సమయం.. ఎక్కడా బెడ్ దొరకలేదు.. నా ఊపిరితిత్తులు 60 శాతానికి ఫైగా ఇన్ఫెక్ట్ అయ్యాయి. పెద్ద పెద్ద ఆసుపత్రులన్నింటికీ ఫోన్ చేశా.. ఎవరు సాయం చేయలేదు.. నా పరిస్థితి విషమంగా ఉంది. కొన్నిసార్లు నేను చచ్చిపోయానేమో అని అనుకున్నా. ఆ సమయంలో నా దేవుడు పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి చెప్పాలనుకున్నా.. కానీ, ఆయన కూడా కరోనాతో పోరాడుతున్నారు. దీంతో చివరగా చిరంజీవి అన్నయ్యకు ఫోన్ చేశా.. విషయం చెప్పా.. కొద్దిసేపు ఆయనేం మాట్లాడకుండా మౌనంగా ఉండి కాల్ కట్ చేశారు.. వెంటనే నాకు బెడ్ ఏర్పాటు అయినట్లు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆరోజు కనుక ఒక్క నిమిషం లేట్ అయినా నేను ఇప్పుడు బ్రతికి ఉండేవాడిని కాదు. ఇదంతా చిరు అన్న చేసిన సాయం. ఆయన లేకపోతే ఈ ప్రాణం నిలిచేది కాదు”అని భావోద్వేగంతో స్పందించారు. ఇకపోతే ప్రస్తుతం బండ్ల గణేష్ హీరోగా పరిచయమవుతున్నదని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

Tags:    

Similar News