Disha effect : ‘వచ్చిందే టైం.. చేసిందే డ్యూటీ’ కథనానికి కదిలిన వైద్యాధికారులు
దిశ పత్రికలో శుక్రవారం‘వచ్చిందే టైం.. చేసిందే డ్యూటీ’ అనే కథనంపై వైద్య అధికారులు స్పందించారు.
దిశ, నేరేడుచర్ల (పాలకవీడు): దిశ పత్రికలో శుక్రవారం‘వచ్చిందే టైం.. చేసిందే డ్యూటీ’ అనే కథనంపై వైద్య అధికారులు స్పందించారు. శుక్రవారం పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ పల్లె ఆస్పత్రిని నేరేడుచర్ల మండల వైద్యాధికారి డాక్టర్ నాగిని విజిట్ చేశారు. పల్లె ఆస్పత్రి ఎప్పుడు తీస్తున్నారు.. సాయంత్రం ఎప్పుడు మూసివేస్తున్నారు.. అనే అంశాలతో పాటు గురువారం 10 గంటల వరకు కూడా తీయకపోవడానికి కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే దీనిపై పూర్తి విచారణ చేశామని, ఎం ఎల్ హెచ్ పి రచనకు చార్జీ మెమో జారీ చేసి అందజేశామని తెలిపారు. మూడు రోజుల్లో హాస్పిటల్ తీయకపోవడానికి గల కారణాలను తమకు తెలియజేయాలంటూ వివరణ కోరమన్నారు. అలాగే ఈ నివేదికను వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు డీఎంహెచ్వో, డిప్యూటీ డిఎంహెచ్వో తో పాటు జిల్లా కలెక్టర్ కు పంపిస్తామని పేర్కొన్నారు. ఆమె వెంట సి హెచ్ ఓ శ్రీనివాసులు ఉన్నారు .