పోలీసుల ఆధీనంలో దిల్‌సుఖ్ నగర్

దిశ, డైనమిక్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ర్యాలీ మొదలవనుండగా.. భారీగా పోలీసు బలగాలు మోహరించి దిల్‌సుఖ్ నగర్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని సమీపంలోని దుకాణాలను మూసివేయించారు. అంతేకాకుండా.. భారీగా విద్యార్థులు, కాంగ్రెస్ శ్రేణులు వచ్చే అవకాశం ఉన్నందున దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ను సైతం అధికారులు మూసివేశారు. అయితే, దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్ వరకు ర్యాలీ జరగాల్సి ఉండగా.. ర్యాలీకి అనుమతి […]

Update: 2021-10-02 05:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ర్యాలీ మొదలవనుండగా.. భారీగా పోలీసు బలగాలు మోహరించి దిల్‌సుఖ్ నగర్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని సమీపంలోని దుకాణాలను మూసివేయించారు. అంతేకాకుండా.. భారీగా విద్యార్థులు, కాంగ్రెస్ శ్రేణులు వచ్చే అవకాశం ఉన్నందున దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ను సైతం అధికారులు మూసివేశారు. అయితే, దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్ వరకు ర్యాలీ జరగాల్సి ఉండగా.. ర్యాలీకి అనుమతి ఇవ్వని పోలీసులు, ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద పో భారీగా మోహరించారు. దీంతో ర్యాలీకి అంతరాయం ఏర్పడింది.

Tags:    

Similar News