ప్రయాణికుల వివరాలు.. పట్టుకోగలరా ?
దిశ, కరీంనగర్: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్.. కరీంనగర్‌నూ కలవరపెడుతోంది. మత ప్రచారం కోసం కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా వాసుల్లో కరోనా పాజిటివ్ లక్షణాలు వెలువడటంతో ప్రభుత్వం కరీంనగర్‌లో హై అలర్ట్ ప్రకటించింది. దీంతో ఒకరి దగ్గరకు మరొకరు వెళ్లి మాట్లాడుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవంగా ఇండోనేషియాకు చెందిన మత ప్రచారకులు ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగినప్పటికే దేశంలో కరోనా ప్రభావం స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో వీరికి స్క్రీనింగ్ టెస్ట్ చేశారా లేదా అన్న […]
దిశ, కరీంనగర్: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్.. కరీంనగర్‌నూ కలవరపెడుతోంది. మత ప్రచారం కోసం కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా వాసుల్లో కరోనా పాజిటివ్ లక్షణాలు వెలువడటంతో ప్రభుత్వం కరీంనగర్‌లో హై అలర్ట్ ప్రకటించింది. దీంతో ఒకరి దగ్గరకు మరొకరు వెళ్లి మాట్లాడుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవంగా ఇండోనేషియాకు చెందిన మత ప్రచారకులు ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగినప్పటికే దేశంలో కరోనా ప్రభావం స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో వీరికి స్క్రీనింగ్ టెస్ట్ చేశారా లేదా అన్న ప్రశ్నలు వెలువడుతున్నాయి. అంతేకాక వీరు ట్రైన్‌లో ప్రయాణించి తెలంగాణకు వచ్చినందున.. ట్రైన్‌లో వీరితోపాటు ప్రయాణించిన దేశంలోని వివిధ ప్రాంతాల వారికి కరోనా వైరస్ అంటుకునే ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇండోనేషియా వాసులు దాదాపు 24 గంటల పాటు ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ‘ఎస్ 9 కోచ్’లో రామగుండం వరకు ప్రయాణించి, అక్కడి నుంచి ఆటోలో కరీంనగర్ వచ్చారు. కాగా సెంట్రల్ ఏసీ ట్రైన్ సదుపాయం కలిగిన ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ న్యూ ఢిల్లీ నుంచి వైజాక్ వరకు వెళ్తుంది. సాధారణంగా చల్లగా ఉన్న ప్రదేశాల్లో వైరస్ చనిపోయే అవకాశాలు లేనందున, ఆ ట్రైన్‌లో ప్రయాణించిన వారిలో చాలా మందికి వ్యాధి సోకే ప్రమాదం లేకపోలేదు. కాగా, ఇండోనేషియన్స్‌తో పాటు ట్రైన్‌లో ప్రయాణించిన వారి వివరాలు ఇవ్వాలని తెలంగాణ సర్కార్ రైల్వే డిపార్ట్‌మెంట్‌కు లేఖ రాసింది. ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేయించుకున్న వారి వివరాలు తెలిసే అవకాశం ఉన్నా రైల్వే కౌంటర్లలో నేరుగా రిజర్వేషన్ చేయించుకున్న వారి పూర్తి వివరాలు దొరుకుతాయా లేదా అన్నది అనుమానమే. గతంలో తత్కాల్ రిజర్వేషన్ చేసుకున్న వారికి అఫీషియల్ ఐడీ ప్రూఫ్‌తో రిజర్వేషన్ చేసే విధానం ఉండేది. ప్రస్తుతం ప్రూఫ్ లేకుండా తత్కాల్ రిజర్వేషన్ చేస్తున్నారు. దీంతో ఆ ట్రైన్‌లో ట్రావెల్ చేసిన వారి వివరాలు తెలిసేదెలా అన్నది అంతు చిక్కకుండా తయారైంది.
తప్పించుకునేందుకు కొత్త దారి..
‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్నట్టుగా ఉంది ఇప్పటి పరిస్థితి. ప్రపంచమంతా కరోనా కారణంగా బిక్కు బిక్కుమంటుంటే కొంతమంది విదేశీ ప్రయాణీకులు ఇండియాలో అడుగుపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆందోళన కల్గిస్తున్నాయి. విదేశాల నుంచి ఇండియాకు చేరుకోగానే ఇక్కడి అధికారులు చేస్తున్న స్క్రీనింగ్ టెస్టుల్లో జ్వరం, జలుబు, దగ్గు ఉన్నట్టు తేలితే.. ఐసోలేషన్ సెంటర్‌కు తరలిస్తారని భావించి, కొందరు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇండియాలో దిగే ముందు ట్యాబ్లెట్స్ వేసుకుంటుండంతో స్క్రీనింగ్ టెస్ట్‌లకు చిక్కకుండా బయటపడుతున్నారని తెలుస్తోంది. దీనివల్ల నిజంగానే కరోనా సోకిన వారు ఇండియాలో అడుగుపెట్టిన తరువాత ఇక్కడి వారికి వైరస్ అంటించే ప్రమాదం ఉంది.
Tags :Corona, Karimnagar, Indonesia, AP Sampark kranti train, Ramagundam