ఏపీలో కలకలం.. ఆ ప్రకటనే కారణం
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న వేళ.. జిల్లాల్లో రెట్టింపు కేసులు నమోదవుతూ కరోనా కేసుల్లో పాత రికార్డులు బద్దలవుతున్న సమయంలో… దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) చేసిన హెచ్చరికలు ఏపీ వాసుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. దేశంలో పరిస్థితి ఏమాత్రం బాగా లేదని, రోజుకు సగటున 30 వేలపై చిలుకు కేసులు దేశంలో నమోదవుతున్నాయంటూ ఐఎంఏ ప్రకటించింది. దేశంలో 29 రాష్ట్రాలు, […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న వేళ.. జిల్లాల్లో రెట్టింపు కేసులు నమోదవుతూ కరోనా కేసుల్లో పాత రికార్డులు బద్దలవుతున్న సమయంలో… దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) చేసిన హెచ్చరికలు ఏపీ వాసుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి.
దేశంలో పరిస్థితి ఏమాత్రం బాగా లేదని, రోజుకు సగటున 30 వేలపై చిలుకు కేసులు దేశంలో నమోదవుతున్నాయంటూ ఐఎంఏ ప్రకటించింది. దేశంలో 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగిన భారత దేశంలో 30 వేల కేసులు నమోదైతే.. కేవలం ఏపీలోనే నాలుగు వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. అంటే ఏపీలో 13 శాతం కేసులు నమోదవుతున్నాయి. ఇది ప్రమాదకర స్థితి అని వైద్యులు పేర్కొంటున్నారు. తూర్పుగోదావరి, కర్నూలు వంటి జిల్లాల్లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని.
గతంలో విదేశాలు, ఇతర రాష్ట్రల నుంచి వచ్చిన వారి వల్ల పాజిటివ్ కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు ఎలాంటి ట్రావెల్ రికార్డులు లేకున్నా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఐఎంఏ చెబుతున్నట్టు సామాజికి వ్యాప్తి మొదలైందని భావించవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇంతవరకు పట్టణాల్లోనే పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యేవి.. ఇప్పుడు పల్లెల్లో కూడా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
ఈ మధ్యే ఏపీలోని విజయనగరం జిల్లాలోని 50 కుటుంబాలు నివాసముండే ముత్తాయి వలస అనే చిన్న పల్లెలో చికత్స చేసిన ఒక వైద్యుని కారణంగా 27 కుటుంబాల్లోని వారికి కరోనా సోకిందంటే.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. దీంతో ఏపీలో సామాజిక వ్యాప్తి మొదలైందన్న భావన వ్యక్తమవుతోంది. మరి వైరస్ ఎలా నియత్రితమవుతుందని ఐఎంఏని అడిగితే… మొత్తం జనాభాలో 70 శాతం మందికి వైరస్ సోకితే సామూహిక వ్యాధి నిరోధక శక్తి వస్తుందని తద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి దానిని అడ్డుకుంటుందని చెబుతున్నారు. అలా కాకుంటే దీనికి వ్యాక్సిన్ కనుగొనడం ద్వారా నిరోధక శక్తిని సాధించవచ్చని తెలిపింది.