కల్వకుంట్ల కుటుంబానికి రోజులు దగ్గర పడ్డయ్

దిశ, నిజామాబాద్ రూరల్: తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగిస్తోన్న కల్వకుంట్ల కుటుంబానికి రోజులు దగ్గర పడ్డాయని డిచ్‌పల్లి ఎంపీపీ గద్దె భూమన్న అన్నారు. మంగళవారం బీజేపీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కులచారి దినేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లోని రోగుల మధ్య కేట్‌కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీపీ భూమన్న మాట్లాడుతూ.. 2023లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని […]

Update: 2021-08-31 07:08 GMT

దిశ, నిజామాబాద్ రూరల్: తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగిస్తోన్న కల్వకుంట్ల కుటుంబానికి రోజులు దగ్గర పడ్డాయని డిచ్‌పల్లి ఎంపీపీ గద్దె భూమన్న అన్నారు. మంగళవారం బీజేపీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కులచారి దినేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లోని రోగుల మధ్య కేట్‌కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీపీ భూమన్న మాట్లాడుతూ.. 2023లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి అధికారాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని అభిప్రాయపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ‘దళితబంధు’ పేరుతో టీఆర్ఎస్ సర్కార్ వేల కోట్లు ఖర్చు చేయడానికి పూనుకున్నదని ఆరోపించారు. ఏడేండ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆయనే కుర్చీలో కూర్చొని అక్రమాలకు తెరలేపారని, అప్పుడే ముఖ్యమంత్రికి దళితులపై ఉన్న ప్రేమేంటో తెలిసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్యామ్‌రావు, సర్పంచ్ సతీష్ రావు, నాయకులు యాదగిరి, వెంకటరమణ, రవీందర్ గౌడ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News