త్వ‌ర‌తగ‌తిన ఫిర్యాదుల ప‌రిష్కారం

దిశ, న్యూస్‌బ్యూరో: బోర్డు దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం. దానకిషోర్ అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో డయల్ యువర్ ఎండీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఓల్డ్ అల్వాల్, గన్ ఫౌండ్రీ, హాబ్సిగూడ, పుప్పాలగూడ, అంబర్‌పేట్, గుడి మల్కాపూర్, రాయదుర్గం, మౌలాలీ తదితర ప్రాంతాల నుంచి 13 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం సమీక్ష సమావేశంలో దానకిషోర్ మాట్లాడుతూ వర్షాకాలం […]

Update: 2020-06-06 08:59 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: బోర్డు దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం. దానకిషోర్ అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో డయల్ యువర్ ఎండీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఓల్డ్ అల్వాల్, గన్ ఫౌండ్రీ, హాబ్సిగూడ, పుప్పాలగూడ, అంబర్‌పేట్, గుడి మల్కాపూర్, రాయదుర్గం, మౌలాలీ తదితర ప్రాంతాల నుంచి 13 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం సమీక్ష సమావేశంలో దానకిషోర్ మాట్లాడుతూ వర్షాకాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో నగరప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే నగరంలోని 1.5మీటర్ల లోతు గల మ్యాన్ హోళ్లకు సెఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శివారు మున్సిపాలిటీల్లోని 1.5 మీటర్ల లోతు గల మ్యాన్ హోళ్లకు సెఫ్టీ గ్రిల్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. నగర ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాన్‌హోల్ మూతలను తెరవకూడదని సూచించారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైన, తెరిచి ఉంచినట్లు తెలిస్తే జలమండలి కస్టమర్ కేర్ నెంబర్ 155313 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి. రవిల పాల్గొన్నారు.

Tags:    

Similar News