భార్య, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్.. ముగ్గురితో అలా గడపడానికి సినిమా స్టైల్లో..
దిశ, వెబ్ డెస్క్: ఒక భార్య, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్.. ఇద్దరిలోనూ ఒకరు డాక్టర్. వారితో టూర్స్, హోటల్స్, రిసార్ట్స్ లో సరదాగా గడపడం. అతనిదో విలాసవంతమైన జీవితం. అలాంటి లివింగ్ స్టైల్ కావాలంటే సంపాదన కూడా అదే రేంజ్ లో ఉండాలి కదా. అంత సంపాదించాలంటే మంచి జీతం ఇచ్చే కంపెనీలో జాబ్ అయినా ఉండాలి లేదంటే కాసులు కురిపించే వ్యాపారమైనా ఉండాలి. ఇవి రెండూ లేకుంటే పూర్వీకులు సంపాదించిపెట్టిన ఆస్తులైనా ఉండాలి. కానీ అతనికి […]
దిశ, వెబ్ డెస్క్: ఒక భార్య, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్.. ఇద్దరిలోనూ ఒకరు డాక్టర్. వారితో టూర్స్, హోటల్స్, రిసార్ట్స్ లో సరదాగా గడపడం. అతనిదో విలాసవంతమైన జీవితం. అలాంటి లివింగ్ స్టైల్ కావాలంటే సంపాదన కూడా అదే రేంజ్ లో ఉండాలి కదా. అంత సంపాదించాలంటే మంచి జీతం ఇచ్చే కంపెనీలో జాబ్ అయినా ఉండాలి లేదంటే కాసులు కురిపించే వ్యాపారమైనా ఉండాలి. ఇవి రెండూ లేకుంటే పూర్వీకులు సంపాదించిపెట్టిన ఆస్తులైనా ఉండాలి. కానీ అతనికి ఇవన్నీ లేవు..! అయినా లగ్జరీ లైఫ్ ఎలా సాధ్యమనేగా మీ సందేహం. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఢిల్లీలోని షాలిమార్ గార్డెన్ ప్రాంతానికి చెందిన ఇరవై ఏడేళ్ల ఆదిల్ మాలిక్ విలాసవంతమైన జీవితం గడపాలని కలలు కంటుంటేవాడు. ఆ కలలు నెరవేర్చుకోడానికి అతను ఎంచుకున్న మార్గం దొంగతనం. ఢిల్లీలో రోజుకు అతను ఐదారు దొంగతనాలకు పాల్పడేవాడు. ఆ దొంగసొమ్ముతో హైఫై గా జీవించేవాడు. బాడీ బిల్డింగ్ కోసం సిటీలో టాప్ జిమ్ లకు వెళ్ళేవాడు. అతనికి పెళ్ళై ఓ భార్య ఉన్నప్పటికీ మరో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ తో సైడ్ ట్రాక్ నడిపించేవాడు. వారితో కలిసి స్టార్ హోటల్స్ లో విందులు, వినోదాలు, హాలిడే ట్రిప్స్ అంటూ ఎంజాయ్ చేసేవాడు. మరోవైపు భార్యకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తూ ఆమెను కూడా మెప్పించేవాడు. ట్విస్ట్ ఏంటంటే తన ఇద్దరి గర్ల్ ఫ్రెండ్స్ లో ఒకామె డాక్టర్ కావడం విశేషం.
ఇలా 3 దొంగతనాలు 6 పార్టీలు అంటూ సరదాగా దూసుకుపోతున్న అతని స్పీడ్ కి పోలీసులు బ్రేకులు వేశారు. పోలీసులకు 3 నెలల వ్యవధిలో వందకుపైగా చైన్ స్నాచింగ్ కంప్లైంట్స్ అందాయి. దీంతో ఆ కేసును అధికారులు చాలా సీరియస్ గా తీసుకుని విచారణ ప్రారంభించారు. చైన్ స్నాచింగ్ దొంగలను విచారిస్తుండగా ఆదిల్ సోదరుడు అద్నాన్ కూడా చైన్ స్నాచర్ కావడంతో ముందు అతను పోలీసులకు చిక్కాడు. అతన్ని విచారిస్తుండగా పోలీసులకు ఆదిల్ గురించి తెలిసింది. దీంతో పోలీసులు అతన్ని ఆధారాలతో సహా పట్టుకునేందుకు పక్కా పథకం రచించారు.
ఆదిల్ రాకపోకలపై ఓ కన్నేసి ఉంచారు. ఆదిల్ ఎప్పటిలానే ఇంటి నుండి దొంగతనానికి బయలుదేరాడు. మఫ్టీలో ఉన్న పోలీసులు కూడా అతనికి అనుమానం రాకుండా ఫాలో అవడం స్టార్ట్ చేశారు. చాలా సినిమాల్లో దొంగతనాలు చేసే హీరోల్లానే.. స్పోర్ట్స్ బైక్ పై ధూమ్ సినిమా స్టైల్లో దొంగతనం స్పాట్‌కు చేరుకున్నాడు. రోడ్డు మీద ఒంటరిగా వెళుతున్న ఓ వ్యక్తిని చూశాడు ఆదిల్. అటు ఇటు గమనించి ఎవరూ చూడట్లేదన్న ధైర్యంతో వెంటనే తన వద్ద ఉన్న తుపాకీ బయటకి తీసి ఆ వ్యక్తిని బెదిరించి, అతని వద్ద ఉన్న సొమ్మును దోచుకోబోతుండగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. రెడ్ హ్యాండెడ్ గా అతన్ని అదుపులోకి తీసుకుని, తన వద్ద నుండి మొబైళ్లు, భారీ మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.