ఫేమస్ అయ్యేందుకు కారణం ధోనీనే : కోహ్లీ
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మధ్య ఎంత మంచి స్నేహం ఉందో అందరికీ తెలుసు. ధోనీ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి.. జట్టులో సాధారణ సభ్యుడిగా కొనసాగుతున్నా సరే.. కెప్టెన్ కోహ్లీ అతడికి విపరీతమైన గౌరవం ఇచ్చేవాడు. మ్యాచ్ జరిగే సమయంలో ఒక్కోసారి కోహ్లీ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుంటే.. కీపర్‌గా ఉన్న ధోనీ ఫీల్డింగ్ మార్పులు చేర్పులు చేయడం అందరికీ తెలిసిన విషయమే. అయితే.. రంజీల్లో ఆడే రోజుల్లో […]
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మధ్య ఎంత మంచి స్నేహం ఉందో అందరికీ తెలుసు. ధోనీ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి.. జట్టులో సాధారణ సభ్యుడిగా కొనసాగుతున్నా సరే.. కెప్టెన్ కోహ్లీ అతడికి విపరీతమైన గౌరవం ఇచ్చేవాడు. మ్యాచ్ జరిగే సమయంలో ఒక్కోసారి కోహ్లీ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుంటే.. కీపర్‌గా ఉన్న ధోనీ ఫీల్డింగ్ మార్పులు చేర్పులు చేయడం అందరికీ తెలిసిన విషయమే. అయితే.. రంజీల్లో ఆడే రోజుల్లో కోహ్లీకి అతని కోచ్ ‘చికు’ అనే పేరు పెట్టాడంటా. ఈ విషయం తెలుసుకున్న ధోనీ.. అప్పటి నుంచి కోహ్లీని డ్రెస్సింగ్ రూంలో, ఫీల్డ్‌లో ముద్దు పేరుతోనే పిలుస్తుండేవాడట. దీంతో ‘చికు’ అనే పేరు క్రికెట్ సర్కిల్స్‌లో ఫేమస్ అయిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే వెల్లడించాడు.
కరోనా నేపథ్యంలో స్వీయ నిర్బంధంలో ఉన్న క్రికెటర్లందరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. కాగా, శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌తో కోహ్లీ లైవ్ చాట్ చేశాడు. ఈ సమయంలోనే తనకు చికు అనే పేరు ఎలా వచ్చిందో.. ధోనీ ఎలా ఫేమస్ చేశాడో చెప్పుకొచ్చాడు. ‘2007లో బాగా జుట్టు ఊడిపోతుంటే చిన్నగా హెయిర్ కట్ చేయించుకున్నాను. అప్పుడు నా బుగ్గలు, చెవులు పెద్దగా కనిపించేవి. అప్పుడు నన్ను చంపక్ అనే పేరుతో పిలిచే వాళ్లు. ఆ తర్వాత రంజీ కోచ్ చికు అనే పేరు పెట్టాడు.
Tags: Virat Kohli, MS Dhoni, Peterson, Chiku, Instagram