పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
రామగుండం జనరల్ ఆస్పత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
దిశ, రామగుండం : రామగుండం జనరల్ ఆస్పత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగుండం జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
రామగుండం వైద్య కళాశాల పరిధిలోని ఆసుపత్రిలో రోగులతో ఆసుపత్రి సిబ్బంది ఎలా ప్రవర్తించాలో సూచించారు. ఆసుపత్రిలోని లేబర్ రూమ్, ఎంఐసీయూ, నూతనంగా ఆసుపత్రి ప్రాంగణంలో వేస్తున్న రోడ్డు నిర్మాణ పనులను, నూతన నర్సింగ్ కాలేజ్ కోసం ప్రతిపాదించిన భవనాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ హెచ్ఓడీ డాక్టర్ అరుణ, ఆర్ఎంఓ అప్పారావు పాల్గొన్నారు.