బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడిగా ధనుష్.. అవార్డు సొంతం
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ బ్రిక్స్ (BRICS) ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నాడు. దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన ‘అసురన్’ చిత్రానికి ధనుష్ ఈ పురస్కారం దక్కించుకోగా ఈ వేడుకను శనివారం గోవాలో నిర్వహించారు. ఈ గుడ్ న్యూస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ధనుష్.. ‘ఇది పరిపూర్ణ గౌరవం’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా ఇప్పటికే మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్న ‘అసురన్’ మూవీకి సంబంధించి మరో అవార్డ్ రావడం పట్ల […]
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ బ్రిక్స్ (BRICS) ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నాడు. దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన ‘అసురన్’ చిత్రానికి ధనుష్ ఈ పురస్కారం దక్కించుకోగా ఈ వేడుకను శనివారం గోవాలో నిర్వహించారు. ఈ గుడ్ న్యూస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ధనుష్.. ‘ఇది పరిపూర్ణ గౌరవం’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా ఇప్పటికే మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్న ‘అసురన్’ మూవీకి సంబంధించి మరో అవార్డ్ రావడం పట్ల అభిమానులు, సెలబ్రిటీలు ధనుష్‌కు అభినందనలు తెలుపుతున్నారు.
కలైపులి ఎస్ థాను నిర్మించిన సినిమాను పూమణి రచించిన ‘వెక్కయ్’ నవల ఆధారంగా తెరకెక్కించారు. ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియాతో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు పాల్గొన్నాయి. కాగా దక్షిణాఫ్రికా చిత్రం ‘బరకత్’తో పాటు రష్యన్ చిత్రం ‘ది సన్ అబౌ మీ నెవర్ సెట్స్’ ఉత్తమ చిత్ర అవార్డును పంచుకున్నాయి.