DGCI అనుమతి.. స్పుత్నిక్ వి థర్డ్ ఫేస్ ట్రయల్స్!
దిశ, వెబ్‌డెస్క్ : రష్యా తయారీ కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి మూడో దశ ట్రయల్స్ కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(DGCI)అనుమతులు మంజూరు చేసింది. స్పుత్నిక్ వి క్లినికల్ ట్రయల్స్ కోసం రెడ్డీస్ ల్యాబోరేటరీస్‌కు పర్మిషన్ కూడా లభించింది. సుమారు 1500 మంది వాలంటీర్లపై స్పుత్నిక్ వి టీకా పరీక్షలు జరపనున్నట్లు రెడ్డీస్ ల్యాబోరేటరీ తెలిపింది. అంతేకాకుండా ఇదివరకు చేసిన రెండు దశల క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని డీఎస్ఎంబీ సమీక్షించింది.అనంతరం భద్రతా పరంగా ఎలాంటి […]
దిశ, వెబ్‌డెస్క్ : రష్యా తయారీ కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి మూడో దశ ట్రయల్స్ కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(DGCI)అనుమతులు మంజూరు చేసింది. స్పుత్నిక్ వి క్లినికల్ ట్రయల్స్ కోసం రెడ్డీస్ ల్యాబోరేటరీస్‌కు పర్మిషన్ కూడా లభించింది. సుమారు 1500 మంది వాలంటీర్లపై స్పుత్నిక్ వి టీకా పరీక్షలు జరపనున్నట్లు రెడ్డీస్ ల్యాబోరేటరీ తెలిపింది.
అంతేకాకుండా ఇదివరకు చేసిన రెండు దశల క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని డీఎస్ఎంబీ సమీక్షించింది.అనంతరం భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు లేవని నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మూడో దశ ప్రయోగాలను అనుమతినివ్వాలని డీసీజీఐకు డీఎస్ఎంబీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే దేశంలో విజయవంతంగా ట్రయల్స్ పూర్తి చేసుకుని భారత్ బయోటెక్ తయారీ అయిన కోవాగ్జిన్, సీరమ్ మేడ్ కోవిషీల్డ్ టీకాలు ఇవాళ వ్యాక్సినేషన్ ప్రక్రియకు సిద్ధమైన విషయం తెలిసిందే.