TTD: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన
తిరుమల (Tirumala)లో వైకుంఠ ద్వార దర్శనాలు (Vaikunta Dwara Darshan) ఆదివారంతో ముగిశాయి.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala)లో వైకుంఠ ద్వార దర్శనాలు (Vaikunta Dwara Darshan) ఆదివారంతో ముగిశాయి. ఈ క్రమంలోనే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ (TTD) కీలక ప్రకటన చేసింది. సోమవారం నుంచి ఎలాంటి టోకెన్లు లేకుండా భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ప్రోటోకాల్ (Protocol) మినహా సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం (VIP Break Darshan), ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి ట్రస్ట్ (Srivani Trust) టికెట్ల జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఇదే ఏడాది డిసెంబర్ నెలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి.
పది రోజుల వ్యవధిలో మొత్తం 7.5 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని అధికారులు పేర్కొన్నారు. గతేడాది కంటే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023-2024లో సుమారు 6.47 లక్షల మంది.. 2022-22లో 3.78 లక్షల మంది, 2020-21లో 4 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసిన నేపథ్యంలో నేటి నుంచి సర్వదర్శనానికి అనుమతులు ఇస్తూ టీటీడీ (TTD) ప్రకటన విడుదల చేసింది.