Shani Dev: శనివారం రోజున వీటిని అస్సలు తీసుకోకండి.. తీసుకుంటే శని కోపానికి చుక్కలు లెక్క పెట్టాల్సిందే..!

జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహం ( shani ) ప్రత్యేకమైనది.

Update: 2025-03-18 12:07 GMT
Shani Dev: శనివారం రోజున వీటిని అస్సలు తీసుకోకండి.. తీసుకుంటే శని కోపానికి చుక్కలు లెక్క పెట్టాల్సిందే..!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహం ( shani )  ప్రత్యేకమైనది. అందు వలన శనిని పూజించే సమయంలో కొన్ని నియమాలను పాటించాలి. లేదంటే, శనీశ్వరుడి కన్నెర్ర చేస్తాడు. మీరు, ప్రతి శనివారం శనిని పూజిస్తుంటే.. వీటి గురించి తప్పక తెలుసుకోవాలి.

వారంలో శని దేవుడికి శనివారం అంటే చాలా ఇష్టం. ఆ రోజున వీటిని దగ్గరికి కూడా రానివ్వకూడదు. కొందరు ఇవేం పట్టించుకోకుండా అన్ని తినేస్తుంటారు. కానీ, ఆ రోజున వీటిని తింటే బాగా కోపం వస్తుందట. శని ఆధ్యాత్మిక ప్రవర్తనను చాలా ఇష్టపడతాడు. అలాంటి పరిస్థితుల్లో డ్రింక్ చేయడం లేదా స్మోకింగ్ చేయడం వంటివి జీవితంలో కష్టాలకు దారి తీయోచ్చు. కాబట్టి, ఈ రోజున వీటిని ముట్టుకోకపోవడమే మంచిది.

శనివారం రోజున ఎర్ర పప్పుతో వంటకాలను అస్సలు తినకూడదు. అంగారకుడు, శని గ్రహాలకు కోపం చాలా ఎక్కువ. కాబట్టి, శనివారం రోజున దీనిని తీసుకుంటే శని, కుజుడు మీపై కోపం చూపించవచ్చు. ఈ కారణంగా మీరు, మీ జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. శని దేవుడు, ఎప్పుడూ చల్లని వస్తువులను ఇష్టపడతాడు అని చెబుతుంటారు. ఈ గ్రహం వలన కలిగే దుష్ప్రభావాల నుండి బయటపడాలంటే శనివారం రోజున ఎర్ర మిరపకాయలను అస్సలు తినకూడదు. అలాగే, ఇదే రోజున పాలు కూడా తాగకూడదు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. మన శరీరానికి శక్తిని ఇచ్చే పాలు అయినా శనివారం నాడు తాగకూడదు. ఇలా చేస్తే , శని దేవుడును అవమానించడమేనని భావిస్తారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.


Read More..

Rahu And Ketu : రాహు, కేతు నక్షత్ర సంచారం.. ఆ రాశుల వారికి గోల్డెన్ టైమ్‌ స్టార్ట్..! 

Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (18-03-2025)  

Tags:    

Similar News