Rahu And Ketu : రాహు, కేతు నక్షత్ర సంచారం.. ఆ రాశుల వారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్..!
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు రాశి సంచారాలు చేస్తుంటాయి.

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు రాశి సంచారాలు చేస్తుంటాయి. గ్రహాలకు అధిపతి అయిన కుజుడు రాశి సంచారాలతో పాటు నక్షత్ర సంచారాలు కూడా చేస్తాడు. ఈ నక్షత్ర సంచారాలు చాలా అరుదుగా ఉంటాయి. దీని ప్రభావం 12 రాశుల వారిపై పడుతుంది. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 3న కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. అయితే, దీని వలన కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటే .. మరి కొన్ని రాశుల వారికి ప్రతి కూలంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో రెండు రాశుల వారి అదృష్టం రెట్టింపు కానుంది. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
తులా రాశి ( Tula Rasi )
రాహు, కేతు నక్షత్ర సంచారం వలన తులా రాశి వారు అనేక ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా, కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారికి ప్రమోషన్ వస్తుంది. పాత భూములకు రేట్లు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు నుంచి బయటపడతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
వృషభ రాశి ( Vrushabha Rasi )
రాహు, కేతు నక్షత్ర సంచారం వలన వృషభ రాశి వారికి శుభంగా ఉండనుంది. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగే, పెండింగ్ పనులన్ని పూర్తి చేస్తారు. కోర్టుకి సంబంధించిన కేసుల్లో గెలుస్తారు. కెరీర్ కి సంబంధించిన విషయంలో మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో కారు లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరకు చేరుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.
Read More..