నేడు నాగుల పంచమి- తొలి శ్రావణ శుక్రవారం.. ఈ పనులు చేస్తే మీ దశ తిరిగినట్లే.. పైగా డబ్బే డబ్బు
నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో శ్రావణమాస సందడి ప్రారంభం అవుతుంది.
దిశ, ఫీచర్స్: నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో శ్రావణమాస సందడి ప్రారంభం అవుతుంది. ఈ శ్రావణ శుక్రవారం కోసం మహిళలంతా ఎప్పటినుంచో ఎదురుచూశారు. ఇవాళ శ్రావణ శుక్రవారం మాత్రమే కాదు.. నాగుల పంచమి కూడా. అయితే ఎంతో ప్రత్యేకమైన ఈ రెండు రోజులు ఒకటే రోజున రావడంతో మహిళలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ రోజు (ఆగస్టు 9) ఈ విధంగా పూజ చేస్తే ఎంతటి దరిద్రమైన ఇట్లే తొలగిపోతుందని, అపారమైన సంపద మీ సొంతమవుతుందని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.
కాగా శ్రావణమాసంలో ప్రతి మంగళవారం యాక్షి దీపం దక్షిణ దిక్కున పెట్టాలట. దీపం కింద వేసిన పీటను పసుపు కుంకుమలతో అలంకరించండి. తర్వాత బియ్యం పిండితో పీట మీద ముగ్గులు వేయండి. అనంతరం దీపంలో నూనె వేసి తొమ్మిది వత్తులతో దీపం వెలిగించండి. లక్ష్మిదేవికి నిష్ఠతో పూజలు చేయండి. అలాగే శ్రావణమాసంలో అంగారకురుడికి కొత్త బట్టలు ధరించి పూజ చేయండి. గ్రహానికి రుణానికి అధిపతి అంగారకుడు అని చెప్పుకుంటారు. కాగా ప్రతి రోజూ ఎవరైతే ఆయనకు పూజలు చేస్తారో వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్రం చెబుతుంది.
ఇలా ఆగస్టు నెల మొత్తం చేసినట్లైతే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం మటుమాయమవుతుంది. ఇక ఇవాళ నాగుల పంచమి కాబట్టి చాలా మంది జనాలు పుట్ట దగ్గరకు వెళ్లి పాలు పోస్తుంటారు. అయితే పుట్టలో పాలు పోసే ముందు సర్ప సూక్తం చదువుతూ పోస్తే ఇంట్లో కుటుంబసభ్యులందరికి మేలు జరుగుతుందంటున్నారు జ్యోతిష్య పండితులు.