తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి పట్టే సమయం ఎంతంటే..?
వరుస సెలవులతో కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.
దిశ, వెబ్‌డెస్క్: వరుస సెలవులతో కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు కంపార్ట్‌మెంట్లలో మొత్తం నిండి క్యూలైన్‌లో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు కల్పించే సర్వదర్శనానికి 36 గంటలు సమయం పడుతుంది. శుక్రవారం శ్రీవారిని 71,782 మంది దర్శించుకోగా.. 36,844 మంది తలనీలాలు సమర్పించారు. హుండీకి రూ. 3.28 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.