Surya Grahan: ఈ నెలలోనే మొదటి సూర్యగ్రహణం.. ఆ రెండు రాశుల వారికి బ్యాడ్ టైం స్టార్ట్.. దరిద్రం మొదలైనట్లే ..!

భార్య , భర్తల మధ్య గొడవలు పెరిగి సంబంధాలు తెగిపోయే అవకాశం కూడా ఉంది.

Update: 2025-03-08 03:56 GMT
Surya Grahan: ఈ నెలలోనే మొదటి సూర్యగ్రహణం.. ఆ రెండు రాశుల వారికి బ్యాడ్ టైం స్టార్ట్.. దరిద్రం మొదలైనట్లే ..!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : మన హిందూ మతంలో గ్రహణాలను అశుభంగా చెబుతుంటారు. అయితే, ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ( Surya Grahan  )  ఈ నెల 29న ఏర్పడనుంది. ఈ క్రమంలోనే రెండు రాశులకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతే కాదు, వీరు ఆర్థికంగా సమస్యల బారిన పడే అవకాశం కూడా ఉంది. ఈ సూర్యగ్రహణం మార్చి 29న సంభవించనుంది. అయితే, అదే సమయంలో తెలుగు సంవత్సరాది కూడా జరుపుకోనున్నారు. ఈ గ్రహణం రోజున శని రాశి మార్పు వల్ల రెండు రాశుల వారికీ ఇబ్బందులు ఇంకా పెరుగుతాయట. ఆ దురదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కుంభ రాశి

30 ఏళ్ల తర్వాత శనిదేవుడు మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో, కుంభ రాశివారిపై కూడా అశుభ దృష్టి పడనుంది. సూర్యగ్రహణం ఈ ప్రభావం పడుతుంది. భార్య , భర్తల మధ్య గొడవలు పెరిగి సంబంధాలు తెగిపోయే అవకాశం కూడా ఉంది. అలాగే, పని ప్రదేశంలో అవమానాలు జరుగుతాయి. ఆర్ధిక సమస్యలు ఎక్కువవుతాయి. అప్పుల ఊబి నుంచి బయట పడలేక చాలా ఇబ్బందులు పడతారు. అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. 

మేషరాశి

మేష రాశివారికి సూర్యగ్రహణం ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఈ రాశి వారిపై శని దృష్టి పడటంతో జీవితంలో అనేక మార్పులు వస్తాయి. అలాగే, మొదలు పెట్టిన పనులన్ని మధ్యలోనే ఆగిపోతాయి. అంతేకాదు ఆర్థిక బాధలు ఎక్కువనున్నాయి. శనిదేవుడు అశుభ దృష్టితో ముందుకు వెళ్ళలేరు. కుటుంబీకులతో విబేధాలు వస్తాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News