గరుడ వాహనంపై విహరించిన శ్రీవారు

తిరుమల తిరుపతిలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఐదవ రోజైన మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి.

Update: 2024-10-08 14:00 GMT

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతిలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఐదవ రోజైన మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి గరుడ వాహనంపై తిరుమాఢవీధుల్లో విహరించారు. శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైన గరుత్మంతుని వాహనంపై ఊరేగడాన్ని చూసేందుకు వేలాదిమంది భక్తులు హాజరయ్యి, పులకించి పోయారు. గరుడసేవలో భాగంగా మూల విరాట్ ను అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, శ్రీ వేంకటేశ్వర సహస్రమాల వంటి అభరణాలతో ఉత్సవ మూర్తిని అలంకరించి ఊరేగించారు. గరుడ వాహనంపై విహరించే మలయ్యప్పస్వామిని దర్శించుకుంటే వైకుంఠప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. కాగా నేటి సాయంత్రం జరిగిన గరుడ వాహన సేవకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయినట్టు టీటీడీ అధికారులు ప్రకటించారు.   


Similar News